మీకు జన్ ధన్ అకౌంట్ ఉందా..? అయితే మీకో గుడ్ న్యూస్. మీ అకౌంట్ లో బ్యాలెన్స్ లేకపోయినా రూ.10వేలు విత్ డ్రా చేసుకోవచ్చు ఎలా..? అన్నది తెలుసుకొని 10 వేల రూపాయలు మీసొంతం చేసుకోండి.
పేద ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచాలన్నా ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం 2014 ఆగస్టు 28న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన(పీఎంజేడీవై) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.. అణగారిన వర్గాలకు బ్యాంకింగ్ సౌకర్యం కల్పించాలన్న ఆశయం. తద్వారా వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చవచ్చన్నది కేంద్రం ఆలోచన. ఇప్పటివరకూ ఈ పథకం కింద కొన్ని కోట్ల మంది అకౌంట్లు అయితే ఓపెన్ చేశారు కానీ, దాని ప్రయోజనాలు ఉపయోంచుకున్నవారు చాలా తక్కువ. ఈ ఖాతా ఉన్న వారు అకౌంట్ లో నగదు లేకపోయినా రూ.10వేలు పొందవచ్చు. అంతేకాదు.. రూ.1.30వేల ఇతర ప్రయోజనాలు పొందవచ్చు. అదెలా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
గతంలోనూ జన్ ధన్ ఖాతాదారులకు ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం ఉండేది. కాకుంటే రూ.5వేలు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిమితిని కేంద్ర ప్రభుత్వం 10వేలకు పెంచింది. అంటే మీ ఖాతాలో ఒక్క రూపాయి లేకపోయినా రూ. 10,000 విత్‌డ్రా చేసుకోవచ్చన్నమాట. అలాగే, జన్ ధన్ ఖాతాదారులు లక్ష రూపాయల వరకూ ప్రమాద బీమా, రూ. 30 వేల వరకూ జీవిత బీమా సౌకర్యాలు పొందవచ్చు. ఒకవేళ భార్యాభర్తలిద్దరికీ జన్ ధన్ ఖాతాలుంటే.. ఇద్దరికీ ప్రత్యేకంగా ప్రయోజనాలు అందుతాయి. రెండు ఖాతాలకు వేర్వేరుగా ప్రమాద బీమా, జీవిత బీమా ప్రయోజనాలను కల్పిస్తారు.అయితే ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం మాత్రం కుటుంబంలో ఒకరికే అందజేస్తారు.
మీరు కూడా ఈ పథకాల ప్రయోజనాలు పొందాలనుకుంటే వెంటనే జన్ ధన్ ఖాతా తెరవండి. సమీపంలోని బ్యాంకు శాఖకు వెళ్లి బ్యాంకు సిబ్బందిని సంప్రదించండి. ఒకవేళ ఇదివరకే ఏదో బ్యాంకులో ఖాతా ఉంటే.. మళ్లీ ఖాతా తెరవాల్సిన అవసరం లేదు. రూపే కార్డుతో మీకు ప్రయోజనాలన్నీ కల్పిస్తారు. మీరు చేయాల్సిందల్లా మీకు రూపే కార్డు లేకపోతే బ్యాంకుకు వెళ్లి రూపే కార్డు కోసం దరఖాస్తు చేయాలి.
ఖాతాదారుని అకౌంట్ లో బ్యాలెన్స్ లేనప్పటికీ ఖాతా నుంచి(పొదుపు లేదా కరెంట్) నిర్ణీత మొత్తం వరకు డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. ఇతర క్రెడిట్ సదుపాయాల వలే, ఖాతాదారుడు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ద్వారా నగదు విత్ డ్రా చేసినప్పుడు కొంత వడ్డీ కట్టాల్సి ఉంటుంది. స్వల్పకాలిక రుణం రూపంలో జన్ ధన్ ఖాతాదారులు రూ.10వేల వరకు డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు.
ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలంటే యజమాని సదరు ఖాతాను కనీసం ఆరు నెలల పాటు ఆపరేట్ చేసి ఉండాలి. ఒక కుటుంబంలో ఒక సభ్యుడు మాత్రమే ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని పొందవచ్చు. సాధారణంగా మహిళా సభ్యులకు ఈ అవకాశం ఉంటుంది. పీఎంజేడీవై ఓవర్ డ్రాఫ్ట్ కింద రూ.2 వేల వరకు ఎలాంటి గ్యారెంటీ అవసరం లేదు. ఓవర్ డ్రాఫ్ట్ గరిష్ట వయోపరిమితిని కూడా ప్రభుత్వం 60 నుండి 65 సంవత్సరాలకు పెంచింది.
ఈ పథకానికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా కింద నంబర్లలో సంప్రదించవచ్చు.