దేశంలో నగదురహిత లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా యూపీఐ పేమెంట్స్ బాగా చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు యూపీఐ పేమెంట్స్ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. బ్యాంక్ సర్వర్ల కారణంగా పేమెంట్స్ జరగవు. అలాంటి సమయాల్లో కస్టమర్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
నగదురహిత లావాదేవీలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతి చిన్న అవసరానికి కూడా యూపీఐ యాప్స్ నే వాడుతున్నారు. నగదురహిత లావాదేవీలు జరగడం వల్ల పారదర్శకత ఉంటుందని కేంద్రం ఎప్పటి నుంచో చెబుతోంది. పైగా ఈ యూపీఐ యాప్స్ వాడటం వల్ల మీకు క్యాష్ బ్యాక్స్, కూపన్స్ పొందవచ్చు. వాటిని రెడీమ్ చేసుకోవడం వల్ల కస్టమర్స్ కి కూడా లాభం ఉంటుంది. అందుకే ఆన్ లైన్ పేమెంట్స్ ని వాడటం ఎక్కువ చేశారు. మీరు ఒకసారి యూపీఐ ద్వారా చెల్లింపులు చేయాలి అంటే అందుకు కచ్చితంగా సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా కూడా చెల్లింపులు చేయవచ్చు.
నిజానికి సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసే పని లేకుండా చెల్లింపులు చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త విధానం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. యూపీఐ లైట్ పేరిట గతేడాది సెప్టెంబర్ లో ఈ ఫీచర్ ని ప్రవేశ పెట్టారు. ఫోన్ పే వాడుతున్న వారికి ఈ ఫీచర్ ఇప్పటికే తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఫోన్ పే కూడా చేరింది. తాజాగా ఫోన్ పే లైట్ ని తీసుకొచ్చింది. దీని ద్వారా మీరు ఫోన్ పే లైట్ లో కొంత డబ్బుని యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకున్న దానిని మీరు చిన్న మొత్తంలో చెల్లింపులు చేసే సమయంలో వాడుకోవచ్చు. అయితే ఇందులో గరిష్టంగా రూ.2 వేల వరకు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒకసారి గరిష్టంగా రూ.200 వరకు పేమెంట్ చేయచ్చు. ఇలా చేయడం వల్ల బ్యాక్ సర్వర్ ఇబ్బంది ఉన్నా కూడా పేమెంట్ లో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఫోన్ పే లైట్ ని పొందేందుకు ఇలా చేయండి. మీరు ఈ ఫోన్ లైట్ ఫీచర్ ని యాక్టివేట్ చేసుకునేందుకు లేటెస్ట్ వర్షన్ ని పొంది ఉండాలి. ఫోన్ పేలో మీకు హోమ్ పేజ్ లో ఫోన్ పే లైట్ అని కనిపిస్తుంది. మీరు దానిని క్లక్ చేసిన తర్వాత మీ యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే మీ ఫోన్ పే లైట్ యాక్టివేట్ అవుతుంది. అందులో మీరు యాడ్ చేయాలనుకున్న మొత్తాన్ని ఎంటర్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అయితే గరిష్టంగా రూ.2 వేలు మాత్రమే యాడ్ చేయగలరు. ఒకసారి రూ.200 మాత్రమే పే చేయగలరు అని గుర్తుపెట్టుకోవాలి. ఇది రోజువారి అవసరాల కోసం చిన్న మొత్తంలో పేమెంట్స్ చేసేందుకు తీసుకొచ్చిన ఫీచర్. ప్రస్తుతం ఫోన్ పే లైట్ వర్షన్ రావడంపై వినియోగదారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ సర్వర్ తో సంబంధం లేకుండా నిశ్చింతగా పేమెంట్స్ చేసుకోవచ్చంటూ కామెంట్ చేస్తున్నారు.