బంగారం ధర రాకెట్ కన్నా వేగంగా దూసుకుపోతుంది. తులం అంటే 10 గ్రాముల బంగారం ధర 57 వేల రూపాయలకు పైగా ఉంది. ఇక గత కొన్ని రోజులుగా పసిడి ధర పడిపోతూ వస్తుంది. ప్రస్తుతం బంగారం కొనవచ్చా.. నిపుణులు ఏమంటున్నారు అంటే..
బంగారం అంటే భారతీయులకు ఎంత మోజో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పండుగలు, పబ్బాలు, వివాహాది శుభకార్యాలు మాత్రమే కాక.. సందర్భంతో పని లేకుండా బంగారం కొనుగోలు చేస్తారు. ఎందుకంటే మన దృష్టిలో బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు.. పెట్టుబడి కూడా. అయితే గత కొంత కాలంగా బంగారం ధర రాకెట్ కన్నా వేగంగా దూసుకుపోతుంది. 10 గ్రాముల బంగారం ధర 57 వేల రూపాయలకు పైగా ఉంది. అయితే ఈ బంగారం ధర భారీగా పెరుగుతుంది.. తులం లక్ష రూపాయలు అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అంటూ ఈ ఏడాది ప్రారంభంలో వార్తలు వచ్చాయి. అయితే గత కొన్ని రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తోంది.
ఈ క్రమంలో నిపుణులు.. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా గత కొన్ని రోజులుగా బంగారం ధరలు గరిష్టం నుంచి తగ్గుతూ వస్తున్నాయిని చెబుతున్నారు. యూఎస్ డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్ తిరిగి రీబౌండ్ కావటం వల్ల బంగారం ధరల ర్యాలీకి బ్రేకులు పడ్డాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాక బంగారం మీద పెట్టుబడి పెట్టాలనుకునే ఇన్వెస్టర్లు ధర తగ్గినప్పుడు బంగారం కొనుగోలు చేయటం ఉత్తమమని అభిప్రాయపడుతున్నారు. అలానే ప్రస్తుతం గోల్డ్ ధరలు బులిష్ మెుమెంటంలో ఉన్నందున.. అమ్మడం వంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలో నేడు ఎలాంటి మార్పు లేదు. బంగారం ధర నేడు తగ్గలేదు.. పెరగలేదు. ఇలా ఉండటం కొనుగోలుదారులకు శుభవార్తే అంటున్నారు మార్కెట్ నిపుణులు. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,250 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,040కి చేరుకుంది. ఇక వెండి ధరలో సైతం ఎలాంటి మార్పూ కనిపించలేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,380గా ఉండగా.. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,600.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,380 ఉండగా.. విశాఖటపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,600.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,380గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,400.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,250గా ఉండగా.. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,650 .. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,430.. న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,750.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,530.. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,600.. 24 క్యారెట్ల బంగారం ధరరూ.57,380గా ఉంది.
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 72,700 ఉండగా.. విజయవాడలో రూ.72,700, విశాఖపట్నంలో రూ. 72,700, బెంగళూరులో రూ. 72,700, చెన్నైలో రూ. 72,700, న్యూఢిల్లీలో రూ. 70,500, ముంబైలో రూ. 70,500గా ఉంది.