ప్రస్తుతం బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూ పోతున్నాయి. ముఖ్యంగా గత నెల రోజుల కాలంలో బంగారం ధర రూ.3,930 పెరిగిందంటే మార్కెట్ వేవ్ ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. కానీ.., ఇక్కడ ఇంకా షాకింగ్ మ్యాటర్ ఏమిటంటే రానున్న రెండు, మూడు నెలల్లో ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. అయితే.. ఇందుకు కారణాలు లేకపోలేదు. రాబోయేది అంతా పెళ్లిళ్ల సీజన్. దీనితో మామూలుగానే బంగారం ధరల్లో హెచ్చు కనిపిస్తుంది. ఇక కరోనా కారణంగా స్టాక్ మార్కెట్ కుదేలు అవుతోంది. దీనితో పెట్టుబడిదారులు స్టాక్స్ కన్నా.., గోల్డ్ పై ఇన్వెస్ట్ చేయడానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఇది కూడా బంగారం రేటు పెరగడానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఇక ప్రధానంగా.. పడిపోతున్న రూపాయి మారకం విలువ కారణంగా.., దిగుమతుల సమయంలో ఎక్కువ రేటు చెల్లించాల్సి వస్తుంది. ఆ భారం వినియోగదారుడి పై పడుతోంది. దీనితో బంగారం ధర రోజురోజుకి పెరుగుతూనే పోతోంది. ఈరోజు బంగారం ధరలను ఒక్కసారి పరిశీలిస్తే.. 22 క్యారెట్ 10గ్రా బంగారం 44,500. 24 క్యారెట్ 10గ్రా బంగారం 48,560. నిన్నటితో పోలిస్తే 10గ్రా 22 క్యారెట్ 200 రూపాయలు తగ్గింది. అలాగే.. 10గ్రా 24 క్యారెట్ 210 రూపాయలు తగ్గింది. కానీ.., ఈ తగ్గుదల స్వల్ప కాలమే అని మార్కెట్ నిపుణులు తెలియ చేస్తున్నారు. శుభకార్యాలకు గాని, పెట్టుబడులకు గాని బంగారం కొనాలన్నా ఆలోచన మీకు ఉంటే వెంటనే కొనుగోళ్లు మొదలు పెట్టండి. ఎందుకంటే ఆర్ధిక సంవత్సరం ముగింపు రేట్లతో పోలిస్తే మీరు ఇప్పటికే ఆలస్యం చేశారని మీకే అర్ధం అవుతుంది.