బంగారం ధర చుక్కలను తాకుతోంది. ఇక మార్కెట్ విశ్లేషకులు అంచనా వేసినట్లే.. ఈ నెలలోనే బంగారం తులం ధర ఏకంగా 60 వేలకు చేరుకుంది. అయితే నేడుబంగారం ధర భారీగా తగ్గింది. ఆ వివరాలు.
భారతీయులకు బంగారం అంటే ఎంత మోజు, ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాతల కాల నుంచి మన దేశంలో బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించి పసిడి కొనుగోలుకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. నేటి ఆధునిక కాలంలో కూడా చాలా మంది బంగారాన్నే సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. ఇక వివాహాది శుభకార్యల సమయాల్లో ప్రతి ఒక్కరు తమకు చేతనైనంత బంగారం కొనుగోలు చేస్తారు. అయితే నేటి కాలంలో పసిడి ధర చుక్కలను తాకుతోంది. గత కొంత కాలంగా బంగారం ధర రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. దాంతో ఇప్పుడు పసిడి కొనాలనుకునేవారు ఆగిపోతున్నారు. సాధారణంగా మన దేశంలో పెళ్లిళ్లు, పండగలు, ఇతర శుభకార్యాల వేళ బంగారు ఆభరణాల కొనుగోలు తప్పనిసరి. కానీ ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్‌లోనే బంగారం ధర రికార్డు స్థాయిలో ట్రేడవుతుంది. ఇప్పటికే 24 కారెట్ బంగారం తులం ధర 60 వేలకు చేరుకుంది.
ఇక నేడు బంగారం ధర భారీగా పడిపోయింది. తులం మీద ఏకంగా 500 రూపాయలు తగ్గింది. ఇక నేడు అనగా మంగళవారం హైదరాబాద్ సహ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బంగారం ధర ఇలా ఉంది. ఇక నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల మీద రూ.500 మేర పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ బంగారం తులం ధర రూ. 55 వేల మార్కు దిగొచ్చి రూ.54,800 మార్కుకు చేరింది. అలానే 24 క్యారెట్ స్వచ్ఛమైన మేలిమి బంగారం విషయానికి వస్తే రూ.60 వేల మార్కు నుంచి దిగొచ్చింది. ప్రస్తుతం 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర తులం మీద రూ. 540 పడిపోయి రూ.59 వేల 780 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో కూడా బంగారం ధర పడిపోయింది. హస్తినలో నేడు 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రూ.500 తగ్గి రూ.54,950 వద్ద ఉండగా.. 24 క్యారెట్ బంగారం రేటు రూ.540 పడిపోయి రూ.59,930 వద్ద ఉంది.
పది రోజుల వ్యవధిలో కేజీ మీద ఏకంగా 7 వేలు పెరిగిన వెండి ధర.. నేడు ఢిల్లీలో స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. నేడు కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.72 వేల మార్కు వద్ద కొనసాగుతోంది. కానీ హైదరాబాద్‌లో మాత్రం వెండి రేట్లు అలాగే పెరుగుతూనే ఉన్నాయి. నేడు హైదరాబాద్‌లో కేజీ వెండి మీద రూ. 200 పెరిగి రూ.74,600 మార్కు వద్ద ఉంది. మరోవైపు అంతర్జాతీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1981.05 డాలర్ల వద్ద ఉండగా.. స్పాట్ సిల్వర్ 22.54 డాలర్ల వద్ద ఉంది. డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ రూ.82.56 వద్ద ట్రేడవుతోంది.