పసిడి ప్రియులకు ఊరట. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం తగ్గుతోంది. ఇవాళ కూడా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో బంగారం రేటు ఎంత ఉందంటే?
బంగారం కొనాలనుకునే పసిడి ప్రియులకు కాస్త నిరాశ కలిగించే అంశమే. మరీ ఎక్కువగా తగ్గలేదు కానీ స్వల్పంగానే బంగారం ధరలు తగ్గాయి. గత పది రోజుల్లో బంగారం ధరల్లో వచ్చిన మార్పులు గమనిస్తే.. మార్చి 31 నుంచి ఏప్రిల్ 9 వరకూ 4 సార్లు తగ్గగా.. 3 సార్లు పెరిగింది. మార్చి 31న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 300 పెరిగి రూ. 55 వేలు ఉంది. అదే రోజున 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 330 పెరుగుదలతో రూ. 60 వేల మార్కును అందుకుంది. ఏప్రిల్ 3వ తేదీన 22 క్యారెట్ల బంగారం రూ. 300 తగ్గి రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ. 330 తగ్గి 59,670 వద్ద కొనసాగింది. ఏప్రిల్ 4న మాత్రం ఏకంగా రూ. 600, రూ. 660 పెరిగింది.
దీంతో 22 క్యారెట్ల బంగారం రూ. 55,300 కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం రూ. 60,330 ని చేరుకుంది. 60 వేల మార్కును దాటేసింది. ఆ మరుసటి రోజున కూడా బంగారం భారీగా పెరిగింది. ఏప్రిల్ 5వ తేదీన 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల వద్ద ఏకంగా రూ. 950 పెరగగా.. 24 క్యారెట్ల బంగారం రూ. 1030 పెరిగింది. దీంతో 22 క్యారెట్ల బంగారం రూ. 56,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ. 61,360 కి చేరుకుంది. ఏప్రిల్ 6, 7, 9 తేదీల్లో 22 క్యారెట్ల బంగారం రూ. 460 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం రూ. 500 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. ఇవాళ ఉదయం 8.45 గంటలకు స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 1990.92 డాలర్లు ఉండగా.. ఔన్సు వెండి ధర రూ. 24.74 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది.
మన రూపాయి మారకం విలువ అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ తో పోలిస్తే ప్రస్తుతం రూ. 81.89గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గినా.. దేశీయంగా స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,790 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ బంగారం ధర రూ. 55,800 ఉంది. ఇవాళ 10 గ్రాములకు రూ. 10 మాత్రమే తగ్గింది. గ్రాము వద్ద రూ. 1 తగ్గింది. దీంతో గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5,579 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా రూ. 10 తగ్గింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,870 ఉండగా.. ఇవాళ రూ. 60,860 ఉంది. గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ. 6,086 వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి ధరల విషయానికొస్తే ఎలాంటి మార్పులూ చోటు చేసుకోలేదు. నిన్న ఏ ధర ఐతే ఉందో ఇవాళ అదే ధర కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 80,200 ఉంది. గడిచిన 10 రోజుల్లో వెండి ధర రెండు సార్లు తగ్గగా.. 5 సార్లు పెరిగింది. మార్చి 31న కిలో వెండి రూ. 77,500 ఉండగా.. ఏప్రిల్ 1న రూ. 200 పెరుగుదలతో రూ. 77,700 కి చేరుకుంది. ఏప్రిల్ 3న రూ. 600 తగ్గుదలతో రూ. 77,100 వద్ద కొనసాగింది. ఏప్రిల్ 4న రూ. 700 పెరుగుదలతో రూ. 77,800 గా ఉంది. అయితే ఏప్రిల్ 5న మాత్రం భారీగా పెరిగింది. ఏకంగా రూ. 2900 పెరుగుదలతో 80 వేల మార్కుని దాటేసింది. ఆరోజున వెండి రూ. 80,700 ఉంది. ఆ తర్వాత రోజు తగ్గిన వెండి ధర ఏప్రిల్ 7న రూ. 200 పెరుగుదలతో 80,200 వద్ద కొనసాగుతోంది. ఏప్రిల్ 8,9 తేదీల్లో ఎలాంటి మార్పులూ లేక వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం అయితే 80 వేల మార్కుని దాటేసింది.