బంగారం ధర చుక్కలను తాకుతోంది. రెండు రోజులు తగ్గితే.. మళ్లీ వరుస పెట్టి పెరుగుతూనే ఉంది. ఇక నేడు బంగారం ధర ఎలా ఉంది.. ఎంత పెరిగింది అంటే..
బంగారం అంటే ఇష్టం లేని వారు దాదాపుగా భారతదేశంలో ఎవరు ఉండరు. ఆభరణంగానే కాక.. ఆదాయ వనరుగా కూడా ఉపయోగపడుతుందని భావిస్తారు. అత్యవసర వేళ.. అవసరానికి చేతిలో డబ్బులు లేకపోతే బంగారమే ఆదుకుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో బంగారం ధర చుక్కలను తాకుతుంది. ఈ ఏడాది ఆల్ టైం గరిష్టానికి చేరింది బంగారం ధర. 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర 60 వేల రూపాయలు దాటేసింది. 22 క్యారెట్ బంగారం ధర కూడా భారీగానే పెరిగింది. ఇక ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా అక్షయ తృతీయ పండుగ తర్వాత తగ్గిన బంగారం ధర.. గత రెండు రోజులుగా పెరుగుతోంది. అయితే నేడు బంగారం ధర స్థిరంగా ఉంది. దాంతో బంగారం కొనాలనుకునే వారు.. కొన్ని రోజులు ఆగితే మంచిది అంటున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు. ఇక నేడు తులం బంగారం ధర ఎంత ఉంది అంటే..
నేడు హైదరాబాద్‌లో బంగారం ధర ఎలా ఉంది.. 10 గ్రాముల రేటు ఎంత ఉంది అంటే.. క్రితం సెషన్‌తో పోలిస్తే నేడు హైదరాబాద్‌లో బంగారం ధర స్థిరంగానే కొనసాగుతోంది. ప్రస్తుతం 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం రేటు రూ.55,950 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధరలో కూడా ఎలాంటి మార్పు లేదు. నేడు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.61,040 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 55,100 పలుకుతుండగా.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల రేటు రూ.61,190 మార్క్ వద్ద ఉంది.
వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. వెండి ధర నేడు స్థిరంగా ఉంది. అయినప్పటికీ రికార్డు స్థాయిల్లోనే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర ఇవాళ రూ.80,200 మార్క్ వద్ద ఉంది. క్రితం సెషన్‌లో కిలో మీద రూ.500 తగ్గిన వెండి ధర ఇవాళ మాత్రం స్థిరంగానే ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కిలో వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కిలో సిల్వర్ రేటు రూ.76,500 పలుకుతోంది. ఇక అంతర్జాతీయంగా కూడా బంగారం ధర కాస్త దిగివచ్చింది. ఇటీవలి కాలంలో స్పాట్ గోల్డ్ రేటు 2 వేల డాలర్ల వరకు చేరిన విషయం తెలిసిందే. అయితే డాలర్ పుంజుకుంటుండడంతో ధరలు పడిపోతున్నాయి. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1987 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 24.89 డాలర్ల వద్ద కొనసాగుతోంది.