అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలనుకునేవారికి పసిడి ధర భారీగా షాకిచ్చింది. పండగ రోజున బంగారం ధర భారీగా పెరిగింది. నేడు హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి అంటే..
భారతీయులకు బంగారం అంటే ఎంత మోజో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాంతో వివాహాది శుభకార్యాల సందర్భంగానే కాకుండా.. కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో తప్పకుండా బంగారం కొనుగోలు చేస్తారు. దానిలో భాగంగానే వరలక్ష్మి వ్రతం, ధన్‌తెరాస్, అక్షయతృతీయ వంటి పర్వదినాల సందర్భంగా బంగారం కొనుగోలు చేస్తారు. దాంతో ఆ సమయాల్లో బంగారం కొనుగోలుకు భారీగా డిమాండ్ ఉంటుంది. దానికి తగ్గట్టే ధర కూడా పెరుగుతోంది. ఇక ఈ ఏడాది అక్షయతృతీయ ఏప్రిల్ 22న అనగా శనివారం నాడు వచ్చింది. ఇక గత కొన్నాళ్లుగా అక్షయ తృతీయ నాడు బంగారం కొనేవారి సంఖ్య పెరుగుతోంది. ఇక నేడు అందులోనూ అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనాలనుకునేవారికి పసిడి ధర భారీగా షాక్ ఇచ్చింది. నేడు బంగారం ధర ఎలా ఉంది.. ఎంత పెరిగింది అంటే..
ఇక గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర.. నిన్న తగ్గింది. ఇది ఇలానే కొనసాగితే.. అక్షయ తృతీయ రోజున కచ్చితంగా బంగారం కొనాలనుకునేవారికి.. నేడు పసిడి ధర భారీ షాక్ ఇచ్చింది. నిన్నటి వరకు తగ్గడం లేదా స్థిరంగా ఉండటం జరిగిన బంగారం రేటు.. నేడు పెరిగింది. అక్షయ తృతీయ రోజున బంగారానికి భారీ డిమాండ్ ఉండటంతో.. ధర పెరుగుతుందని భావించారు. దానికి తగ్గట్టే నేడు బంగారం రేటు పెరిగింది. ఇక నేడు హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో బంగారం ధర ఎలా ఉంది అంటే..
ఇక నేడు హైదరాబాద్ మార్కెట్‌లో ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాముల మీద రూ.200 పెరిగి.. ప్రస్తుతం రూ.56,050 మార్కును తాకింది. ఇక 24 క్యారెట్ బంగారం ధర.. 10 గ్రాముల మీద రూ.220 ఎగబాకి రూ.61,150 మార్కుకు చేరింది. ఇదే సమయంలో ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో కూడా బంగారం రేటు పెరిగింది. అక్కడ 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.200 పెరిగి రూ.56,200 మార్కును చేరింది. 24 క్యారెట్ బంగారం ధర కూడా 10 గ్రాముల మీద రూ.200 పెరిగి రూ.61,280 మార్కుకు చేరింది.
ఇక వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తుంది. నేడు వెండి ధర కూడా భారీగా పెరిగింది. ఇక శనివారం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి మీద తాజాగా రూ.300 పెరిగి.. రూ.81,300 మార్కుకు చేరింది. ఇక ఢిల్లీలో కూడా వెండి ధర పెరిగింది. కిలో మీద రూ.200 ఎగబాకి.. రూ.77,600 వద్ద కొనసాగుతోంది. దేశీయంగా బంగారం ధర పెరగ్గా.. అంతర్జాతీయంగా మాత్రం పసిడి ధర తగ్గడం గమనార్హం. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1980 డాలర్లకు పడిపోయింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు 25 డాలర్లకు దిగొచ్చింది.