పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు మళ్ళీ తగ్గాయి. రోజురోజుకు బంగారం పతనమవుతుంది. బంగారం కొనడానికి ఇది తగిన సమయంగా అనిపిస్తుంది. ద్రవ్యోల్బణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. ఇవాళ స్వచ్ఛమైన బంగారం ఎలా ఉందో చెక్ చేసుకోండి.
గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ నెలలో ధరలు తగ్గడం ఇది ఎనిమిదో సారి. ద్రవ్యోల్బణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్సు స్పాట్ గోల్డ్ ధర రూ. 1842.64 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది. భారతీయ కరెన్సీ ప్రకారం ఔన్సు స్పాట్ గోల్డ్ ధర రూ. 1,52,596.67 వద్ద ట్రేడ్ అవుతుంది. ఒక గ్రాము బంగారం ధర రూ. 4,906.1 వద్ద ట్రేడ్ అవుతుంది. నిన్న ఔన్సు స్పాట్ గోల్డ్ ధర రూ. 1828.84 డాలర్ల వద్ద ట్రేడ్ కాగా.. 0.45 శాతం మేర పెరిగింది. ఇక నిన్న ఔన్సు వెండి ధర రూ. 21.47 డాలర్ల వద్ద ట్రేడ్ అవ్వగా.. ట్రేడ్ ముగిసే సమయానికి 21.73 డాలర్లుగా ఉంది. 0.92 శాతం పెరిగింది. ఇవాళ ఔన్సు స్పాట్ వెండి ధర రూ. 21.73 డాలర్లు ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 57,844.44గా ఉంది.
ఢిల్లీలో గ్రాము బంగారం ధర రూ. 5,195 ఉంది. నిన్న ఇదే బంగారం ధర రూ. 5,215 ఉంది. 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ. 52,150 ఉండగా.. ఇవాళ రూ. 51,950 ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల వద్ద రూ. 200 తగ్గింది. ముంబై, బెంగళూరులో 10 గ్రాముల బంగారం ధర రూ. 51,800 ఉండగా, చెన్నైలో రూ. 52,500 ఉంది. 10 గ్రాముల వద్ద రూ. 300 మేర తగ్గింది. ఇక హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం ధర రూ. 51,800 ఉంది. నిన్న ఇదే బంగారం ధర రూ. 52,000 ఉంది. రూ. 200 తగ్గింది. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ నగరాల్లో ఇదే రేటు ఉంది.
ఢిల్లీలో గ్రాము స్వచ్ఛమైన బంగారం ధర రూ. 5,666 గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ. 56,660 ఉంది. నిన్న ఇదే బంగారం ధర రూ. 56,880 ఉంది. రూ. 220 మేర తగ్గింది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,510 ఉంది. చెన్నైలో రూ. 57,230 ఉండగా.. బెంగళూరులో రూ. 56,560 ఉంది. ఇక ప్రస్తుతం హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ నగరాల్లో రూ. 56,510 ఉంది.
వెండి ధర కూడా తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న కిలో వెండి ధర రూ. 69,000 ఉండగా.. ఇవాళ రూ. 68,600 ఉంది. కిలో దగ్గర రూ. 400 తగ్గింది. ముంబైలో కూడా ఇదే రేటు కొనసాగుతోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో నిన్న కిలో వెండి ధర రూ. 71,800 ఉండగా.. రూ. 600 తగ్గింది. ఇవాళ కిలో వెండి ధర రూ. 71,200 ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే నిన్న ట్రేడ్ ముగిసే సమయానికి ఈ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇవాళ్టి నుంచి మళ్ళీ బంగారం, వెండి ధరలు పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పడిపోయిన గ్రాఫ్ మళ్ళీ ఇవాళ్టి నుంచి లేచే అవకాశం కనబడుతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇవాళ ధరలు తగ్గినా.. రేపటి నుంచి పెరిగే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఇవాళ బంగారం, వెండి కొనుగోలు చేసే వారికి శుభవార్త అని చెప్పవచ్చు.