బంగారం ధర మళ్లీ పెరిగింది. రెండు రోజుల క్రితం తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. నేడు కూడా బంగారం ధర పెరిగింది. తులం మీద ఎంత పెరిగింది.. దేశంలో నేడు బంగారం ధర ఎలా ఉంది అంటే..
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో.. బంగారం ధరలు పడిపోతాయని అందరూ భావించారు. అనుకున్నట్లుగానే బంగారం ధర పతనం ఒక్కరోజుకే పరిమితమైంది. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచిన రోజు.. బంగారం ధర ఏకంగా తులం మీద 800 రూపాయలు తగ్గింది. దాంతో పసిడి ప్రియులు.. కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఇలానే కొనసాగితే.. బంగారం ధర పడిపోతుంది అని భావించారు. కానీ అందుకు భిన్నంగా బంగారం ధర తగ్గినట్లే తగ్గి.. ఆ మరుసటి రోజే.. భారీగా పెరిగింది. తులం మీద 600 రూపాయలు పెరిగి.. కోలుకోలేని షాక్ ఇచ్చింది. అంతేకాక బంగారం ధర ఇలానే పెరుగుతుంది అని అంటున్నారు మార్కెట్ విశ్లషకులు. కారణం ఫెడ్ భవిష్యత్తులో వడ్డీ రేట్ల పెంపును నిలిపివేయనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఆ ప్రభావం బంగారం ధర మీద కూడా ఉంటుంది.
ఇక నేడు కూడా బంగారం ధర పెరిగింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ బంగారం ధర తులం రూ.200 పెరిగి ఏకంగా రూ.55 వేల మార్కును తాకింది. ఇదే సమయంలో 24 క్యారెట్ స్వచ్ఛమైన పసిడి ధర కూడా రూ.220 పెరిగి మరోసారి రూ.60 వేల మార్కుకు చేరింది. అలానే హస్తినలో కూడా బంగారం ధర పెరిగింది. ఢిల్లీలో 22 క్యారెట్ బంగారం రేటు తులం మీద రూ.200 పెరిగి రూ.55,150ని తాకింది. అలానే 24 క్యారెట్ మేలిమి బంగారం రేటు రూ.220 పెరిగి రూ.60,150 వద్ద ఉంది.
బంగారం బాటలోనే వెండి ధర కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఢిల్లీలో నేడు వెండి ధర మరోసారి పెరిగింది. కిలో మీద రూ.400 పెరిగి.. రూ.73 వేల మార్కును చేరింది. అలానే హైదరాబాద్‌లో కూడా వెండి ధర కిలో మీద రూ.300 పెరిగి.. ప్రస్తుతం రూ.75,700 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీతో పోలిస్తే.. హైదరాబాద్‌లో వెండి ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా బంగారం రేటు కాస్త తక్కువగా ఉంటుంది. స్థానికంగా ఉండే పన్నులను బట్టి రేట్లలో ఈ హెచ్చుతగ్గులు ఉంటాయి. అమెరికాలో బ్యాంకింగ్ రంగం సంక్షోభం నేపథ్యంలో అక్కడ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. ఇది ప్రపంచదేశాలపై ప్రభావం చూపుతోంది.