పసిడి, వెండి ధరలు గత కొన్ని రోజులుగా దిగి వస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో అధిక భాగం బంగారం, వెండి ధరలు పతనమవుతూనే ఉన్నాయి. ఇక నేడు వెండి ధర భారీగా పతనం అయ్యింది. బంగారం ధర కూడా తగ్గింది. ఎంతంటే..
పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం, వెండి ధరలు తగ్గి వస్తుండటంతో సామాన్యులకు కాస్త ఊరట కలుగుతోంది. ఈ నెల మొత్తం పసిడి ధర పతనమవుతూనే ఉంది. ఒకటి, రెండు రోజులు మాత్రం కాస్త పెరిగింది. ఇక నేడు కూడా వెండి, బంగారం ధరలు భారీగా తగ్గాయి. మరీ ముఖ్యంగా వెండి రేటు భారీగా పడిపోయింది. అంతర్జాతయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పతనమవుతుండటంతో.. దేశీయ మార్కెట్‌లో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. ఇక నేడు బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయి.. తులం ఎంత ఉన్నాయి అంటే..
ఇక నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ బంగారం ధర తులానికి రూ.150 మేర తగ్గింది. ఇక తాజాగా భాగ్యనగరంలో 22 క్యారెట్ బంగారం తులం ధర రూ.51,35గా ఉంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం తులం ధర హైదరాబాద్‌లో రూ.160 మేర పడిపోయింది. ప్రస్తుతం నగరంలో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.56,020గా ఉంది. అలానే దేశ రాజధాని న్యూఢిల్లీలో బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధర పడిపోయింది. ఢిల్లీలో 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 150 తగ్గి.. రూ.51,500 వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ బంగారం తులం ధర రూ.160 తగ్గి ప్రస్తుతం రూ.56,170 వద్ద కొనసాగుతోంది.
ఇక బంగారం బాటలోనే వెండి ధర సైతం నేరు భారీగా పడిపోయింది. హైదరాబాద్‌లో కిలో వెండి తాజాగా రూ.1,000 మేర పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.69,000కు దిగొచ్చింది. అలానే న్యూఢిల్లీలో కూడా వెండి ధర కిలోకు రూ.700 మేర తగ్గింది. ప్రస్తుతం దేశ రాజధానిలో న్యూఢిల్లీలో రూ.66,800గా ఉంది. అలానే అంతర్జాతీయంగా చూసుకుంటే.. నేడు బులియన్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1818 డాలర్ల వద్ద ఉంది. కొన్ని రోజుల క్రితం వరకు స్పాట్ గోల్డ్ ధర 2 వేల డాలర్లకు చేరుకుంది. అయితే అది క్రమంగా దిగి వస్తోంది. అలాగే స్పాట్ వెండి ధర కూడా భారీగానే పడిపోతోంది. తాజాగా స్పాట్ వెండి రేటు 20.65 డాలర్ల వద్ద తచ్చాడుతోంద. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు తగ్గడంతో.. దేశీయంగా కూడా ఆ ప్రభావం కనబడుతోంది.