వివాహాల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ భారీగా ఉంటుంది. కానీ పసిడి ధర పెరుగుతుండటంతో.. కొనలేక ఆగిపోతున్నారు. ఇలా ఉండగా నేడు బంగారం ధర స్వల్పంగా దిగి వచ్చింది. ఆ వివరాలు..
బంగారం ధరలు రోజుకో రకంగా ఉంటున్నాయి. స్థిరత్వం లేకుండా పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. బంగారం, పసిడి ధరల పెరుగుదలకు అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకునే పరిణామాలే కారణం. డాలర్ ధర పెరగడం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి విషయాలు బంగారం ధర తగ్గడం, పెరగడం మీద ప్రభావం చూపిస్తాయి. ఇక భారతీయులకు బంగారం అంటే ఎంత మోజో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పండగలు, వివాహాది శుభకార్యాలు ఇలా సందర్భం వచ్చిన ప్రతి సారి బంగారం కొనడానికి ఆసక్తి చూపుతారు. అయితే గత కొన్ని రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతూ పోతుంది. ఇది వివాహాల సీజన్ కావడంతో.. పసిడికి డిమాండ్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో బంగారం ధర పెరుగుతూ ఉండటంతో సామాన్య, మధ్యతరగతి వారు.. బంగారం కొనాలంటే భయపడుతున్నారు. అయితే నేడు పసిడి ధర స్వల్పంగా దిగి వచ్చింది. ఆ వివరాలు..
గత కొంత కాలంగా వరుసగా పెరుగుతూ వస్తోన్న బంగారం, వెండి ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా ధరలు దిగివస్తున్న క్రమంలో ముందు ముందు మరింత పడిపోయే అవకాశం ఉందంటున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు. కానీ దేశంలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. పైగా ఆర్బీఐ రూ.2000 నోటును ఉపసంహరించుకున్న నేపథ్యంలో అనధికారికంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. దీంతో ధరలు పెరిగే ఛాన్స్ లేకపోలేదనే వాదన సైతం తెర మీదకు వస్తోంది. ఇక నేడు ఢిల్లీ హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర ఎంత తగ్గింది అంటే..
నేడు భాగ్య నగరంలో బంగారం ధర కాస్త దిగి వచ్చింది. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి ప్రస్తుతం రూ. 56,290 వద్దకు చేరింది. అలానే 24 క్యారెట్ మేలిమి బంగారం 10 గ్రాముల మీద రూ.10 తగ్గి రూ.61,410 వద్దకు వచ్చింది. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.56,440 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు కూడా 10 గ్రాముల మీద కేవలం రూ.10 తగ్గి రూ.61,560 పలుకుతోంది.
ఇక నేడు వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తూ వచ్చింది. నేడు దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి మీద రూ.300 తగ్గి ప్రస్తుతం రూ.75 వేలకు దిగివచ్చింది. ఇక హైదరాబాద్ మహా నగరంలో కిలో సిల్వర్ రేటు రూ.400 తగ్గి 78,600ల రూపాయలకు పడిపోయింది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో సిల్వర్ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాగే బంగారం రేటు కాస్త తక్కువగా ఉంటుంది. అందుకు స్థానికంగా ఉండే ట్యాక్సులు, కమీషన్ల వంటివి కారణమవుతాయి.
ఇక దేశీయంగా ఇలాంటి పరిస్థితులు ఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధర రోజు రోజుకు దిగి వస్తోంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడంతో బంగారం ధర దిగి వస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సు ధర 1967 డాలర్లకు దిగివచ్చింది. ఇది కొద్ది రోజుల క్రితం 2000 డాలర్లకు పైకి చేరిన విషయం తెలిసిందే. ఇక స్పాట్ సిల్వర్ రేటు 23.83 డాలర్లకు దిగివచ్చింది.