గత కొంతకాలంగా భారీగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధర.. ఈ వారంలో దిగి వచ్చింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తూ భారీగా పడిపోయింది. నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి అంటే..
బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉండటం లేదు. వరుసగా కొన్ని రోజుల పాటు పెరగడం లేదంటే వరుసగా తగ్గడం జరుగుతోంది. ఇక పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. బంగారం, వెండి ఆభరణాలకు డిమాండ్ అధికంగా ఉంది. దీనికి తగ్గట్టే పసిడి ధర పెరుగుతూ పోతుంది. క్రితం సెషన్‌లో బంగారం ధర స్థిరంగానే ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో సైతం బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుతో ద్రవ్యోల్బణం దిగివస్తుండడంతో పసిడి, వెండి ధరలు పడిపోతున్నాయి. దానికి తగ్గట్లుగానే దేశీయ బులియన్ మార్కెట్లోనూ ధరలు దిగివస్తున్నాయి. మరీ ముఖ్యంగా వెండి ధర భారీగా పడిపోయింది. గత రెండు సెషన్లలోనే ఏకంగా రూ.4000 పడిపోయింది. మరి నేడు హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి అంటే..
బంగారం ధర దిగి వచ్చి పసిడి ప్రియులకు ఊరట కలిగించింది. నేడు హైదరాబాద్‍లో 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.400 తగ్గి రూ.56,550 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర కూడా భారీగానే పడిపోయింది. 10 గ్రాముల మీద ఏకంగా 440 రూపాయలు దిగి వచ్చి.. రూ.61,690 మార్క్ వద్ద ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర దిగి వచ్చింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాముల మీద రూ.450 తగ్గి.. రూ.56,650 ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాముల మీద రూ.440 దిగివచ్చింది రూ.61,840 మార్క్ వద్ద ట్రేడవుతోంది.
ఇక వెండి విషయానికి వస్తే.. అది కూడా పసిడి బాటలోనే పయనిస్తూ.. భారీగా పడిపోయింది. నేడు హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3300 పడిపోయింది. గత రెండ్రోజుల్లోనే వెండి ధర రూ.4000 దిగిరావడం భారీ ఊరటగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ. 78,700 పలుకుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే కిలో వెండి రేటు ఇవాళ రూ.2600 పడిపోయింది. వరుసగా రెండ్రోజుల్లో మొత్తం రూ.3000 తగ్గింది. ప్రస్తుతం ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.75 వేలు పలుకుతోంది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో గోల్డ్ రేటు కాస్త తక్కువగా ఉంటుంది. కారణంగా స్థానికంగా ఉండే పన్నులు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగివస్తున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ప్రస్తుతం 2011 డాలర్లు పలుకుతోంది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు 23.98 డాలర్ల మార్క్ వద్ద ట్రేడవుతోంది.