విమానం ఎక్కడం అనేది కొంత మందికి కల అయితే.. ఇంకొంత మందికి అది అవసరం కావచ్చు. అయితే విమాన టికెట్లు మాత్రం అంత తక్కువకేమీ రావుకదా? వాటి ధరలు చూసే చాలా మంది విమానాలు ఎక్కేందుకు వెనకడుగు వేస్తుంటారు. ఆకాశామే హద్దుగా అనే సూర్య సినిమాలో రూపాయికి విమానం ఎక్కించినప్పుడు భలే ఉందే.. ఇలాంటి ఆఫర్లు రియల్ లైఫ్ లో ఎందుకు రావని అనుకునే వారు. అయితే ఇప్పుడు మరీ రూపాయి కాకపోయినా చాలా తక్కువ ధరకే ఓ ఎయిర్ లైన్స్ తమ సర్వీసులను అందిస్తోంది. కాకపోతే చాలా తక్కువ సమయం మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం..
గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ ట్రావెల్ ఇండియా ట్రావెల్ సేల్ ని అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రయాణికులకు విమాన టికెట్లపై డిస్కౌంట్స్, స్పెషర్ రేట్లను అందుబాటులో ఉంచుంది. దీనిలో భాగంగా డొమెస్టిక్ విమాన టికెట్స్ రూ.1,199 నుంచి అంతర్జాతీయ టికెట్లను రూ.6,599 నుంచి అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్ కేవలం జనవరి 16 నుంచి జనవరి 19 వరకు టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే అందించనుంది. అలాగే ఈ ఆఫర్ లో టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునేవారు ప్రస్తుతానికి టికెట్లు బుక్ చేసుకునే అవకాశం లేదు. వారు ఫిబ్రవరి 4 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణం చేసేందుకు అయితే ఈ ఆఫర్ లో బుక్ చేసుకోవచ్చు.
అంతేకాకుండా.. ఈ ఎయిర్ లైన్స్ మరో ఆఫర్ కూడా అందిస్తోంది. అదేంటంటే మీ జర్నీని రీ షెడ్యూల్ చేసుకునేందుకు ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరు. అలాగే మీరు మీ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలి అంటే ఫ్రీగా టికెట్ ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. అందుకు ఎలాంటి క్యాన్సిలేషన్ ఛార్జీలను వసూలు చేయరు. ఈ ఆఫర్ కింద లిమిటెడ్ సీట్లను మాత్రమే అందుబాటులో ఉంచారు. ట్రావెల్ ఇండియా ట్రావెల్ సేల్ లో భాగంగా 10 లక్షల టికెట్లను అందుబాటులో ఉంచారు. అవి బుక్ అయిపోతే ఈ ఆఫర్ వర్తించదు. కాబట్టి ఫిబ్రవరి- సెప్టెంబర్ మధ్య మీకు ఏవైనా ప్రయాణాలు ఉంటే ఈ గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ ద్వారా జనవరి 19లోపు టికెట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. మీకు చాలా తక్కువ ధరకే విమాన టికెట్ వస్తుంది.
Pack your bags🧳 because we are GO-ing with THE LOWEST FARES🤩
Grab the lowest domestic fares starting at Rs. 1,199* only & international fares starting at Rs. 6,599* only and save up on flight fares for your trip! pic.twitter.com/Jmxr7IDUsa— GO FIRST (@GoFirstairways) January 16, 2023