కారు అనేది ప్రతి ఒక్కరి కల. ప్రతి మధ్యతరగతి వ్యక్తి కూడా ఏదొకరోజు సొంత కారు కొనుక్కోవాలి అనుకుంటారు. అలాంటి వారికి ఇప్పుడు చెప్పుకోబోయే మారుతీ సుజుకీ కారు బెస్ట్ ఆప్షన్ గా చెప్పచ్చు. ఎందుకంటే ఫుల్ ఎస్‌యూవీ ఫీల్ తో అదిరిపోయే ఫీచర్లను అందిస్తున్నారు. మారుతీ సుజుకీ నుంచి ఇప్పటికే వచ్చిన బ్రెజా, ఎస్-క్రాస్, బలేనో వంటి కార్లకు ధీటుగా ఈ కారు ఫీచర్లు ఉండటం విశేషం. అంతేకాకుండా మిడిల్ క్లాస్ రేంజ్ లో ఇలాంటి ఫీచర్లతో కారుని తీసుకురావడం చాలా గొప్ప విషయం అని ఆటోమొబైల్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా సేఫ్టీ విషయంలో చాలా గొప్ప టెక్నాలజీని వినియోగించారు.
మారుతీ సుజుకీ అంటేనే బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లని అందరికీ తెలుసు. అయితే నెక్సా పేరిట కొన్ని ప్రీమింయ కార్ డిజైన్స్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చారు. బలేనో, బ్రెజా, ఎస్-క్రాస్ వంటి మోడల్స్ తో మారుతీ సుజుకీ మార్కెట్ లో తన స్టామినా ఏంటో నిరూపించుకుంది. ఇప్పుడు ఫ్రాంక్స్ పేరిట తీసుకొచ్చిన ఈ మోడల్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఎందుకంటే దీనిని బలేనో, బ్రెజా, ఎస్-క్రాస్ ఫీచర్లు, లుక్స్ ని మిక్స్ చేసి క్రాస్ ఓవర్ పేరిట తీసుకొచ్చారు. అదిరిపోయే ఫీచర్లతో బడ్జెట్ ఫ్రెండ్లీగా దీనిని తీసుకొస్తున్నారు. టెక్నాలజీ, ఫీచర్లు, సేఫ్టీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని స్పష్టం చేస్తున్నారు.
ఈ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ కారు ఫీచర్ల విషయానికి వస్తే.. దీనిని రెండు ఇంజియన్ వేరియంట్స్ తో అందిస్తున్నారు. ఒకటి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, రెండు 1 లీటర్ టర్బో బూస్టర్ జెట్ ఇంజిన్. ఇందులో స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీని వినియోగించారు. పెడల్ షిఫ్టర్స్ తో 6 స్పీడ్ ఆటోమేటెడ్ గేర్ షిఫ్టింగ్ టెక్నాలజీ ఉంది. మాన్యువల్ అయితే 5 గేర్లతో రానుంది. హెడప్ డిస్ ప్లే, వైర్ లెస్ ఛార్జింగ్, 9 ఇంచెస్ డిస్ ప్లేతో స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ సరౌండ్ సౌండ్, డ్యూయల్ టోన్ ప్లష్ ఇంటీరియర్, 360 డిగ్రీల కెమెరా వంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా 6 స్ట్రైట్ కలర్స్, 3 డ్యూయల్ టోన్ కలర్స్ తో అందుబాటులోకి రానుంది. అలాగే డెల్టా, డెల్టా ప్లస్, సిగ్మా వంటి వేరియంట్లలో రాబోతోంది.
టెక్నాలజీ విషయంలో ఈ కారు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే అతి తక్కువ బడ్జెట్ లో 6 ఎయిర్ బ్యాగ్స్ తో ఈ కారుని తయారు చేశారు. అంతేకాకుండా పెడస్ట్రియన్ ప్రొటెక్షన్ కంప్లైన్స్(ప్రమాదం సమయంలో పాదచారుడుకి దెబ్బలు తగలకుడా కాపాడే టెక్నాలజీ), ఏబీఎస్ టెక్నాలజీ ఉన్నాయి. ఇంక డిజైన్ విషయానికి వస్తే.. ఎల్‌ఈడీ లైట్స్, స్లీక్ డిజైన్, నెక్సావేవ్ గ్రిల్ డిజైన్, 300 లీటర్స్ కి పైగా బూట్ స్పేస్ ఉంది. బేసిక్ మోడల్ లో కూడా షార్క్ ఫిన్ అందిస్తున్నారు. గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో బలేనోకి ఏమాత్రం తీసిపోదు. అన్ని ఫీచర్లను పరిశీలిస్తే.. ఎస్-క్రాస్, బ్రెజా, బలేనోని పోలి ఉంటుంది.
ఈ కారులో మారుతీ సుజుకీ స్మార్ట్ వాచ్ కనెక్టివిటీని కూడా అందిస్తున్నారు. మీ స్మార్ట్ వాచ్ ని మీ కారుకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కనెక్ట్ చేసుకుని మీ కారుని స్టార్ట్ చేయచ్చు, స్టాప్ చేయచ్చు, కారు ఏసీ కంట్రోల్ చేయచ్చు, డోర్స్ లాక్ చేయడం కూడా చేయచ్చు, కారుని కూడా మీరు మీ స్మార్ట్ వాచ్ తో లాక్ చేయచ్చు. ఓవర్ స్పీడ్ అయినా, మీరు సెట్ చేసుకున్న మార్జిన్ దాటుతున్నా కూడా మీ కారును మీ స్మార్ట్ వాచ్ కి అలెర్ట్ వస్తుంది. బ్యాటరీ లో ఉన్నా కూడా మీకు నోటిఫై చేస్తుంది. ఈ కారుని జనవరిలో జరిగిన ఆటో ఎక్స్ పోలో పరిచయం చేశారు. దీని ధర దాదాపు రూ.8 లక్షల నుంచి రూ.14 లక్ష మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ నుంచి అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఇప్పటికే 5500కు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరిగినట్లు చెప్తున్నారు. నెక్సా డీలర్ల ద్వారా ఈ కారు రిటైల్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.
Make way for the new style icon on the block. Presenting FRONX -the latest #sporty and #stylish #SUV from NEXA.
Experience The Shape Of New.
Bookings Open: https://t.co/6w3uMnu7ns#TheShapeOfNew #FRONX #NewFaceOfSUVs #SportySUV#NEXA #Createlnspire #NEXAExperience #RcBhargava pic.twitter.com/veEmVhj2Z0— MARUTI SUZUKI (@marutisuzukiof2) January 29, 2023