ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. దాంతో లెక్కలు, చిట్టాలు, పద్దులు మారతాయి. ఉద్యోగులకు జీతాలు పెంచాలన్నా కూడా ఏప్రిల్ తర్వాత నుంచే పెంచుతారు. ఇక మరి ఏప్రిల్ 1 నుంచి కొన్నింటి ధరలు పెరుగుతుండగా.. మరి కొన్నింటి ధరలు తగ్గనున్నాయి. ఆ వివరాలు..
ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ పోతూనే ఉన్నాయి.. బంగారం రేటు గురించి ఎంత తక్కువ చెబితే అంత మేలు. కూరగాయలు, నిత్యవసరాల ధరలు కూడా ఆకాశన్నంటుతున్నాయి. అసలు మార్కెట్‌లో ఫలానా వస్తువు ధర తగ్గింది అని ఊరట చెందే అవకాశమే లేకుండా పోతుంది. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో జనాలు గగ్గోలు పెడుతుంటే.. ఇక ఏప్రిల్ నుంచి మరి కొన్నింటి ధరలు భారీగా పెరగున్నాయి. ఈ పెరిగే ధరలు.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. మరి వేటి ధరలు పెరగనున్నాయి.. ఎందుకు పెరుగుతాయి అంటే..
మనకు జనవరి 1 లేదంటే.. ఉగాది నుంచి నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. కానీ మార్కెట్‌పరంగా చెప్పాలంటే.. ఏప్రిల్ 1 నుంచి ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. దానికి ముందు ఫిబ్రవరిలో కేంద్రం బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతుంది. ఈ బడ్జెట్‌లో తీసుకునే కొన్ని నిర్ణయాలు ఆ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అనగా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ ఏడాదికి సంబంధించి పెరిగిన ధరలు, పన్ను స్లాబ్, సుంకాలు తదితరవన్ని.. ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అమల్లోకి వస్తాయి. అలానే ఈ ఏప్రిల్ 1 నుంచి దేశీయ మార్కెట్‌లో కొన్ని వస్తువుల ధరలు భారీగా పెరుగుతుండగా.. మరి కొన్నింటి ధరలు పడిపోనున్నాయి. మరి వేటి ధరలు పడిపోతాయి.. వేటి ధరలు పెరుగుతాయి అంటే..