ట్విట్టర్‌కు పోటీగా మరో యాప్ వచ్చేస్తోంది. ఇప్పటికే సెలెక్టెడ్ ఐఓఎస్ యూజర్లకు ఈ కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు మీకోసం..!
జాక్ డోర్సే.. పరిచయం అక్కర్లేని పేరు. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో అయిన జాక్ డోర్సే గురించి తెలియని వారు ఉండరు. ట్విట్టర్ ఈ స్థాయిలో ఫేమస్ అవ్వడం వెనుక ఆయన కృషి ఎంతగానో ఉంది. అలాంటి డోర్సే 2021 నవంబర్‌లో ట్విట్టర్ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కొన్నాళ్ల తర్వాత బోర్డు నుంచి ఆయన వైదొలిగారు. దీంతో డోర్సే స్థానంలో పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ సీఈవోగా ఎంపికయ్యారు. అనంతరం ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనడంతో పరాగ్ కూడా వైదొలగడం తెలిసిందే. ట్విట్టర్ పబ్లిక్ లిమిటెడ్ సంస్థగా ఉండటం కంటే ప్రైవేట్ కంపెనీగా ఉండటమే మంచిదనే అభిప్రాయాన్ని డోర్సే అప్పట్లో వెల్లడించారు.
ట్విట్టర్లో జరుగుతున్న పరిణామాలపై పలు సందర్భాల్లో జాక్ డోర్సే ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి ఆయన తన కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ బ్లూస్కై బీటా వెర్షన్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది యాపిల్ యాప్ స్టోర్‌లో సెలెక్టెడ్ యూజర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంది. డేటా.ఏఐ అనే యాప్ ఇంటెలిజెన్స్ కంపెనీ వివరాల ప్రకారం.. ఐఓఎస్ యాప్ స్టోర్‌లో బ్లూస్కై ఈ ఏడాది ఫిబ్రవరి 17నే అందుబాటులోకి వచ్చింది. ఇప్పటిదాకా 2,000 మంది దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నారు. ప్లస్ బటన్‌ను క్లిక్ చేసి 256 క్యారెక్టర్లతో కూడిన పోస్ట్‌ను క్రియేట్ చేసేలా ఈ యాప్ ఇంటర్ఫేస్ను రూపొందించారని తెలుస్తోంది. ట్విట్టర్ పోస్ట్ బాక్స్‌లో ‘What’s happening’ అని అడుగుతుంది. దీన్ని బ్లూస్కైలో దాన్ని ‘What’s Up?’గా మార్చారట.
షేర్, మ్యూట్, బ్లాక్ అకౌంట్స్ లాంటి ఫీచర్లు కూడా బ్లూస్కైలో ఉన్నట్లు డేటా.ఏఐ సంస్థ తెలిపింది. యాప్ నావిగేషన్‌లో మధ్యలో డిస్కవర్ అనే ట్యాబ్‌ను కూడా పొందుపరిచారని తెలుస్తోంది. ఎవర్ని ఫాలో అవ్వాలి, రీసెంట్ పోస్ట్‌ల లాంటి వాటిని సెర్చ్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందట. 2019లో ప్రారంభమైన బ్లూస్కై ప్రాజెక్టు 2022లో ఉనికిలోకి వచ్చింది. ట్విట్టర్‌ను వీడాకే డోర్సే ఫస్ట్‌టైమ్ దీని గురించి మాట్లాడారు. దీన్ని ‘ఓపెన్ డీసెంట్రలైజ్డ్ స్టాండర్డ్ ఫర్ సోషల్ మీడియా’గా ఆయన అభివర్ణించారు. ట్విట్టర్‌కు పోటీగా వస్తున్న బ్లూస్కై గతేడాది 13 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. డోర్సే సంస్థ బోర్డులో ఉండగా.. ట్విట్టర్ మాజీ సెక్యూరిటీ ఇంజినీర్ ఇందులో ఇటీవలే చేరారని సమాచారం. మరి.. ట్విట్టర్‌కు బ్లూస్కై పోటీనిస్తుందని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Making a re-entry into the social media arena, Twitter’s former CEO and co-founder Jack Dorsey launched his platform Bluesky, an alternative to Twitterhttps://t.co/tgoQEx2sfa
— WION (@WIONews) March 1, 2023