ఒకప్పుడు రతన్ టాటాను అవమానించిన ఫోర్డ్ కంపెనీకి సంబంధించిన కార్లు ఇకపై ఇండియాలో తయారవ్వవని ఆ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ సంస్థ తయారు చేసిన చివరి కారుని విడుదల చేసింది. ఎంతో కాలంగా భారత్ మార్కెట్ లో పట్టు సాధించాలని భావించిన ప్రముఖ అమెరికా ఆటో దిగ్గజం ఫోర్డ్ మోటార్ కంపెనీకి భారత్ లో కాలం చెల్లిందని అర్ధమైంది. అందుకే దాని అనుబంధ సంస్థ అయిన ఫోర్డ్ ఇండియా.. భారత్ లో కార్ల తయారు చేయడం ఆపేస్తున్నట్లు గత ఏడాది ప్రకటించింది. ఈ క్రమంలో ఆ కంపెనీ తయారు చేసిన చివరి కారు అయినటువంటి ఎకో స్పోర్ట్ ను విడుదల చేసింది. ఈ కారును వేరే దేశానికి ఎగుమతి చేసేందుకే చెన్నై ప్లాంట్ లో తయారుచేసినట్టు తెలిపింది. ఫోర్డ్ ఇండియా యూనిట్ ను అధికారికంగా మూసివేసే ముందు ఎగుమతి హామీలను నెరవేర్చింది.
ఫోర్డ్ కంపెనీ గతంలో 2.5 బిలియన్ డాలర్లతో చెన్నై, గుజరాత్ లో రెండు ప్లాంట్లను ఏర్పాటుచేసింది. ఈ ప్లాంట్స్ నుంచి ఎకో స్పోర్ట్, ఫిగో, యాస్పైర్ వంటి మోడళ్లను తయారు చేసేది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించలేదు. దీంతో సంస్థ భారీ నష్టాలను చవి చూడడంతో సెప్టెంబర్ 9, 2021న భారత మార్కెట్ లో కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ఫోర్డ్ సంస్థ వెల్లడించింది. కానీ దిగుమతి చేసిన కార్లను మాత్రం ఇండియాలో విక్రయిస్తామని సంస్థ తెలిపింది. ఇండియన్ ప్లాంట్ లో ఉత్పత్తి అయిన చివరి కారు విడుదల సందర్భంగా ఫోర్డ్ ఇండియా ప్రతినిధి స్పందించారు. B515 ఎకో స్పోర్ట్ మోడల్ కారుని తయారుచేయడంలో సపోర్ట్ చేసిన ఉద్యోగులకి ధన్యవాదాలు తెలియజేశారు.
ఒకప్పుడు రతన్ టాటా కార్ల కంపెనీ కష్టాల్లో ఉంటే సహాయం కోసం అమెరికాలో ఫోర్డ్ మోటార్ కంపెనీకి వెళ్లారు. ఆ సమయంలో “కార్ల గురించి తెలియని మీకెందుకయ్యా కార్ల తయారీ” అంటూ రతన్ టాటాను వెక్కిరించారు. అవమానాన్ని మనసులో ఉంచుకున్న రతన్ టాటా తన కార్ల బ్రాండ్ ఇమేజ్ ను పెంచుకోవడమే కాకుండా ఫోర్డ్ కంపెనీ మీద బెస్ట్ రివేంజ్ తీర్చుకున్నారు. ఏకంగా ఆ కంపెనీకి చెందిన రెండు లగ్జరీ బ్రాండ్ కార్లను ఆయన తన సొంతం చేసుకున్నారు. 2008లో అమెరికా ఆర్ధిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఫోర్డ్ మోటార్ కంపెనీ దివాళా తీసే పరిస్థితిలో జాగ్వార్, ల్యాండ్ రోవర్ బ్రాండ్లను అమ్మకానికి పెట్టింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ రెండు బ్రాండ్లను రతన్ టాటా కొనుగోలు చేసి ఫోర్డ్ కంపెనీ దివాళా తీయకుండా ఒడ్డున పడేశారు. ఆ రకంగా మంచి వారిని అవమానిస్తే కర్మ ఎవరినీ వదిలిపెట్టదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. “ఇప్పుడు ఫోర్డ్ కంపెనీ ఇండియాలో ప్లాంట్ ఆపేస్తుంది, త్వరలో ఫోర్డ్ కార్ల దిగుమతి కూడా ఆపేస్తుంది. అప్పుడు మా రతన్ సారే కంపెనీని ఆదుకుంటారు” అంటూ నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: RGV కొత్త సినిమా కోవిడ్ ఫైల్స్! ప్రభుత్వాల అసమర్థతను తవ్వి తీస్తాడట!
ఇది కూడా చదవండి: Sudigali Sudheer: జబర్దస్త్‌లోకి సుధీర్ రీ ఎంట్రీ అంటూ వార్తలు! అసలు నిజం?