ప్రస్తుతం అన్ని మహా నగరాల్లో క్యాబ్ సర్వీసెస్ విస్తరించి ఉన్న సంగతి తెలిసిందే. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ తో పాటుగా ఓలా, ఉబర్, రాపిడో వంటి క్యాబ్, ఆటో, బైక్ సర్వీసెస్ ను నగర వాసులు వినియోగించుకుంటున్నారు. ఈ క్యాబ్ సర్వీసెస్ కు బాగా డిమాండ్ కూడా పెరిగింది. అందుకే వారు విధించే చార్జీలను కూడా తరచూ పెంచుతూ ఉంటారు. ప్రస్తుతం ఓలా, ఉబర్ వంటి క్యాబ్ సర్వీసెస్ కు కనీస ధర రూ.100 నుంచి ఉంటోంది. మీరు వెళ్లే దూరాన్ని బట్టి ఈ ధర మారుతూ ఉంటుంది. అలాగే మీరు ప్రయాణించే సమయాన్ని బట్టి కూడా ఈ ధరలు మారుతూ ఉంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాలు, సమయాల్లో ఈ క్యాబుల ధరలు మరింత ఎక్కువగా ఉంటాయి. దానిని సర్జ్ అంటారు. అంటే క్యాబులకు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు వీటి ధర కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట.
మీరు అత్యవసరంగా ప్రయాణించాల్సి వస్తే సర్జ్ ఛార్జ్ ఎంత ఉన్నా.. మీరు క్యాబ్ బుక్ చేసుకోక తప్పదు. అలాంటి సమయంలో మీరు మరింత ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తే మీ క్యాబ్ ధర రూ.1000 కూడా దాట్టొచ్చు. చాలామంది ఈ సర్జ్ ఛార్జీలకు బాగా భయపడుతూ ఉంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ సర్జ్ ఛార్జెస్ బాదుడు నుంచి తప్పించుకునేందుకు పలు మార్గాలు ఉన్నాయి. కానీ చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. కొన్ని సింపుల్ టిప్స్ ని ఫాలో అయితే క్యాబ్ సర్జ్ ఛార్జీలు బాదుడు నుంచి మీరు తప్పించుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ముఖ్యంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మెట్రో స్టేషన్ల వద్ద క్యాబులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సినిమా థియేటర్ల వద్ద సినిమా అయిపోగానే క్యాబ్ లకు డిమాండ్ ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ ఎక్కువ మంది ఒకేసారి క్యాబ్లను బుక్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల క్యాబులకు డిమాండ్ పెరుగుతుంది. ఆ ప్రాంతాన్ని సదరు క్యాబ్ కంపెనీ సర్జ్ ప్రాంతంగా గుర్తిస్తుంది. అలా గుర్తించటం వల్ల సాధారణంగా మీరు చెల్లించాల్సిన మొత్తం కంటే కొంత మొత్తాన్ని ఎక్కువగా చార్జ్ చేస్తూ ఉంటారు. ముందు ఎక్కువ మంది క్యాబ్లు బుక్ చేసే ప్రాంతం నుంచి కొంచెం దూరంగా వెళ్లి క్యాబ్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించండి. అలా చేయడం వల్ల మీరు సర్జ్ ఛార్జ్ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ఉదయం సాయంత్రం ఆఫీసులో ప్రారంభం కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లే సమయాల్లో క్యాబ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
మీరు ఆ సమయాల్లో ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది. ఒక అరగంట ముందు ఒక అరగంట తర్వాత మీరు బయటకు వెళ్తే సర్జ్ ఛార్జ్ నుంచి తప్పించుకోవచ్చు. క్యాబ్ యాప్ లలో మీకు షెడ్యూల్ ట్రిప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు ఒకవేళ సాయంత్రం 6 గంటలకు ప్రయాణం చేయాలి అనుకుంటే.. సాయంత్రం 4:30కు గానీ, 5 గంటల సమయంలోనే మీ ట్రిప్ ని షెడ్యూల్ చేసుకుంటే మంచిది. దానివల్ల సర్జ్ నుంచి తప్పించుకోవచ్చు. మీరు ప్రయాణానికి ముందు ప్రతిసరి క్యాబ్ యాప్స్ ని ఓపెన్ చేయకండి. అలాగే ఒకే యాప్ ని ఓపెన్ చేసి క్యాబ్ బుక్ చేసుకోకండి. అన్ని యాప్స్ లో ట్రిప్ ఫేర్ ని పరిశీలించుకోండి. కొన్నిసార్లు దగ్గర ప్రాంతాలకు ఆటోని బుక్ చేసుకోవడం కూడా మంచిదే. తక్కువ ఫేర్ తో మీ రైడ్ ని పూర్తి చేసుకోవచ్చు. ఇలాంటి సింపుల్ టిప్స్ ఫాలో కావడం వల్ల మీ రైడ్ ని తక్కువ ధరలో పూర్తి చేసుకోవచ్చు.