వ్యాపారం చేయడమే మీ లక్ష్యమా..? ఈ ఆలోచన ఉంటే చాలు.. అది చిన్నది అయినా పెద్దది అయినా ఆదాయం మాత్రం తప్పక ఉంటుంది. అందులోనూ అతి తక్కువ పెట్టుబడితో లక్షలు సంపాదించే బిజినెస్ మార్గాలు బోలెడున్నాయి. కనీసం లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టగలం అనుకుంటే మీ కష్టాన్ని బట్టి ప్రతి నెల 50 నుంచి లక్ష రూపాయలు ఆదాయం పొందవచ్చు.
వ్యాపారం చేయాలి చేయాలి.. జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలన్న ఆలోచన ఉంటే చాలు.. అది చిన్నది అయినా పెద్దది అయినా ఆదాయం మాత్రం తప్పక ఉంటుంది. అందులోనూ అతి తక్కువ పెట్టుబడితో లక్షలు సంపాదించే బిజినెస్ మార్గాలు బోలెడున్నాయి. కనీసం లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టగలం అనుకుంటే మీ కష్టాన్ని బట్టి ప్రతి నెల 50 నుంచి లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు. అలాంటి తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగి.. ఎక్కువ ఆదాయం పొందగలిగే ఓ బిజినెస్ ఐడియా వివరాలను మీకందిస్తున్నాం..
‘ఫ్లై యాష్ బ్రిక్స్ వ్యాపారం(సిమెంట్ ఇటుకలు)’ బూడిదతో తయారు చేసే ఈ ఇటుకలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. వేగవంతమైన పట్టణీకరణ యుగంలో, బిల్డర్లు ఇటుకలకు బదులుగా వీటినే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మెల్లమెల్లగా పల్లెలు, చిన్న చిన్న పట్టణాలకు కూడా ఈ కల్చర్ పాకుతోంది. దీంతో రాబోయే కాలమంతా దీనిదే హవా అని వ్యాపార నిపుణులు చెప్తున్నారు. ఈ వ్యాపారం ప్రారంభించాలంటే 100 గజాల స్థలంతో పాటు కనీసం 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీరు గంటకు ఎన్ని ఇటుకలు తయారు చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి పెట్టుబడి ఉంటుంది.
ఈ ఇటుకలను విద్యుత్ ప్లాంట్ల నుండి బూడిద, సిమెంట్, రాతి ధూళిని కలపడం ద్వారా తయారు చేస్తారు. మొత్తం ఐదు దశల్లో సిమెంట్ ఇటుకల తయారీ ప్రక్రియ సాగుతుంది. (1) ప్రొపిషనింగ్(2) మిక్సింగ్ (3) కాంపాక్టింగ్ (4) క్యూరింగ్ (5)డ్రైయ్యింగ్. ఈ ప్రక్రియలు ముగిసేసరికి సిమెంట్ ఇటుక తయారై మీ చేతుల్లో ఉంటుంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే కనీస స్థలం 100 గజాలు ఉండాలి. ఈ వ్యాపారంలో, యంత్రానికి మాత్రమే అధిక పెట్టుబడి ఉంటుంది. 5 నుంచి 6 మందితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అనంతరం మీ డిమాండ్ ను బట్టి మ్యాన్ పవర్ పెంచుకోవచ్చు. మొదట తక్కువ పెట్టుబడితో ఆరభించాలనుకుంటున్నారు కనుక తక్కువ ఉత్పత్తి, తక్కువ మ్యాన్ పవర్ అవసరమయ్యే మెషిన్ కొనుగోలు చేయడం ఉత్తమం.
ముందుగా ఎంచుకున్న ఖాళీ స్థలంలో మెషీన్ ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. అనంతరం ముడి పదార్థాలను కలపడం నుండి ఇటుకలు తయారు చేయడం వరకూ ప్రతిదీ ఇదే చేస్తుంది. పెట్టుబడిని బట్టి గంటకు 400 నుంచి 1000 ఇటుకల లెక్కన రోజుకు 2000 నుంచి 3000 ఇటుకలు తయారుచేయొచ్చు. ఈ వ్యాపారంలో స్థిరపడాలంటే ముఖ్యంగా కావాల్సింది ‘మార్కెటింగ్ మెళుకవలు’. చిన్నా.. పెద్దా.. అన్న తేడా లేకుండా మొదట ఒక బిల్డర్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంటే వ్యాపారానికి డోకా ఉండదు. అనంతరం మీ ఇటుకల నాణ్యత, మీ క్రమశిక్షణే మిమ్మల్ని నలుగురికి తెలియజేస్తుంది.
మీ వద్ద పెట్టుబడి పెట్టేందుకు కూడా డబ్బులు లేకపోయినా బ్యాంకులు రుణ సదుపాయం కల్పిస్తున్నాయి. ప్రధాన్ మంత్రి రోజ్గర్ యోజన, స్వయం ఉపాధి పథకం, ముద్రా లోన్ వంటి పథకాల ద్వారా బ్యాంకులు మీకు రుణాన్ని మంజూరు చేస్తాయి. ఇలా అయినా మీ ఆలోచనకు మొదటి అడుగులు వేసుకోవచ్చు.అనంతరం వ్యాపారంలో నిలదొక్కుకున్నాక వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. ఈ వ్యాపారంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.