ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ యాపిల్, గూగుల్, శాంసంగ్, రెడ్‌మీ వంటి టాప్ బ్రాండ్ రిఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్‌లపై ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో టాప్ కంపెనీ స్మార్ట్‌ఫోన్స్ తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అయితే.. ఈ రిఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్‌లను అమ్మకానికి తీసుకొని వచ్చే ముందు పలు(47) రకాల తనిఖీల చేసినట్లు ఫ్లిప్‌కార్ట్ సంస్థ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు కొత్త మొబైల్స్ కు ధీటుగా పనిచేస్తాయని సంస్థ పేర్కొంది.
తక్కువ ధరలో ఫ్లిప్‌కార్ట్ అందిస్తోన్న రిఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్స్..
ఐఫోన్ ఎస్ఈ
రిఫర్బిష్డ్ ఐఫోన్ ఎస్ఈ బ్లాక్ కలర్ రూ. 9,950 లకు, వైట్ అండ్ సిల్వర్ కలర్ రూ. 9,999 ధరకు అందుబాటులో ఉన్నాయి.
యాపిల్ ఐఫోన్ 6ఎస్
రిఫర్బిష్డ్ ఐఫోన్ 6ఎస్ 32జీబీ వేరియెంట్ రూ.11,999కు, 64జీబీ వేరియెంట్ రూ.13,999 ధరకు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 6ఎస్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు 12 ఎంపీ రియర్ కెమెరాతో వస్తుంది. ఐఫోన్ 6ఎస్‌లో ఏ9 ప్రాసెసర్ ఉంది. ఐఫోన్ 6ఎస్ 16జీబీ కొత్త స్మార్ట్‌ఫోన్ ధర రూ.49,999 అయితే, ఈ సేల్‌లో మీకు రూ.9,999లకు లభిస్తుంది. ఇది సిల్వర్, స్పేస్ గ్రే రంగులలో అందుబాటులో ఉంది.
యాపిల్ ఐఫోన్ 7
రిఫర్బిష్డ్ ఐఫోన్ 7 బ్లాక్ 32జీబీ వేరియంట్ ధర రూ. 14,499కు, 128జీబీ వేరియంట్ రూ.14,999కి అందుబాటులో ఉన్నాయి.ఇక.. ఐఫోన్ 8 64జీబీ వేరియంట్ ధర రూ.17,890.
గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్
64జిబి ర్యామ్ గల రిఫర్‌బ్రిష్డ్ గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్ మొబైల్ రూ. 13,999కు అందుబాటులో ఉంది. పిక్సెల్ 3 ఎక్స్ఎల్’లో 6.3 అంగుళాల క్యూహెచ్ డి+ డిస్ ప్లే, 12.2 మెగా పిక్సల్ రియర్ కెమెరా ఉన్నాయి. ఇందులో స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్, 3,430 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
పిక్సెల్ 3ఏ
రిఫర్బిష్డ్ కాంపాక్ట్ ఫామ్ ఫ్యాక్టర్ 64జీబీ ఫోన్ రూ. 10,789కు లభిస్తుంది. దీనిలో 5.6 అంగుళాల FHD+ డిస్ ప్లే ఉంది. పీక్సెల్ 3ఏలో 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 670 ప్రాసెసర్ ఉంది.
షావోమీ
రిఫర్బిష్డ్ రెడ్‌మీ 4ఏ 2జీబీ ర్యామ్ + 16జీబీ రూ.4,989కు, రెడ్‌మీ 3ఎఎస్ రూ.4,599కు, రెడ్‌మి నోట్ 6 ప్రో రూ.8,899కు, రెడ్‌మీ 6 రూ.5,297 ధరలో అందుబాటులో ఉన్నాయి. ఇక.. రెడ్‌మీ వై2 రూ. 6,389కు, ఎంఐ ఏ2 రూ. 6,779కు, రెడ్‌మీ 7 రూ. 5,999కు, రెడ్‌మీ నోట్ 7 ప్రో రూ. 8,499 ధరలో లభించనున్నాయి.
ఇది కూడా చదవండి: Flipkart Big Saving Days: స్మార్ట్ వాచ్ లపై భారీ డిస్కౌంట్లు.. పూర్తి వివరాలు