ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ ముగిసిన విషయం తెలిసిందే. ఆ ఆఫర్స్ ఉన్నప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్లు, టీవీలు, హోమ్ అప్లైన్సెస్ కొనుగోలు చేశారు. కానీ, కొందరు మాత్రం ఇంకా బెటర్ ఆఫర్స్.. దీపావళి స్పెషల్ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. వారికోసం కూడా ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ సేల్ ఎప్పుడు అని చెప్పేసింది. మరి ఆ సేల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు.. ఆఫర్స్ ఏంటి ఆ డీటైల్స్ మీకోసం.
దీపావళి స్పెషల్ సేల్‌కు రంగం సిద్ధమైంది. అక్టోబరు 17 నుంచి అక్టోబరు 23 వరకు ఫ్లిప్ కార్ట్ ఈ సేల్‌ను ప్లాన్ చేసింది. దానికి పేరు ‘ఫ్లిప్ కార్ట్ బిగ్ దీపావళి సేల్’ అనే పేరుతో రాబోతోంది. ఇందులో టీవీలు, స్మార్ట్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్స్‌పై అద్భుతమైన తగ్గింపులు ఆఫర్ చేస్తోంది. ఫిల్ప్ కార్ట్ ప్లస్ సభ్యుల కోసం అక్టోబరు 16 మధ్యాహ్నం నుంచే డీల్స్ ప్రత్యక్షం కానున్నాయి.
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు, యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులకు ఈ సేల్‌లో 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఉంది. అసలు ఆఫర్లు ఏంటనేది ఇంకా పూర్తి వివరాలు రాలేదు. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్స్‌పై కచ్చితంగా 80 శాతం తగ్గింపు ఉండేలా కనిపిస్తోంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై కూడా 80 శాతం తగ్గింపు ఉంటుంది. టీవీలు, అదర్ అప్లైన్సెస్‌పై 75 శాతం వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.