ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ Flipkart… Big Savings Day Sale పేరుతో తమ కస్టమర్లకు భారీ ఆఫర్లు ప్రకటిస్తోంది. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ మొదలు అన్ని గృహోపకరణాలపై అత్యధిక డిస్కౌంట్లు ఇస్తోంది. వాటిలో భాగంగా టీవీలపై కూడా భారీగానే ఆఫర్లు ఇస్తోంది. స్మార్ట్ టీవీలు కేవలం రూ.7,499 నుంచే అందిస్తోంది. మరి, ఆ ఆఫర్ల పూర్తి వివరాలను మీకోసం ఈ ఆర్టికల్ లో తెలియజేస్తున్నాం.
32 inch స్మార్ట్ టీవీ బెస్ట్ ఆఫర్లు:
Realme Neo: స్మార్ట్ టీవీపై అత్యధికంగా 36 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. రూ.21,999 ఉన్న టీవీని రూ.13,999కే అందజేస్తున్నారు. ఇది హెచ్ డీ రెడీ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ. Icici బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డులపై అదనంగా 10శాతం ఇన్ స్టెంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. డెబిట్/క్రెడిట్ కార్డులతో అత్యధికంగా రూ.2 వేల వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. రూ.11 వేల వరకు ఎక్స్ ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.
Mi 4A Pro, Mi 4c:
Mi కంపెనీకి చెందిన రెండు 32 ఇంచ్ స్మార్ట్ టీవీలపై 25 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. 19,999గా ఉన్న రెండు టీవీలను రూ.14,999కే అందిస్తున్నారు. ఇవి కూడా HD రెడీ LED స్మార్ట్ యాండ్రాయిడ్ టీవీలు.
ఈ రెండు టీవీలు 1 జీబీ ర్యామ్, 8 జీబీ రోమ్ తో వస్తున్నాయి. దాదాపు రెండు టీవీల స్పెసిఫికేషన్స్ ఒక్కటే. ఈ టీవీలపై కూడా అదనంగా రూ.2 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
Samsung HD Ready LED Smart TV:
సాధారణంగా శ్యామ్ సంగ్ బ్యాండ్లపై డిస్కౌంట్లు చాలా అరుదుగా దొరుకుతుంటాయి. ఈసారి 14 శాతం డిస్కౌంట్ తో రూ.19,900 టీవీని రూ.16,999కే అందిస్తున్నారు. అదనంగా రూ.2 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
50 inch స్మార్ట్ టీవీ బెస్ట్ ఆఫర్లు
Oneplus U1S:
దీనిపై ఫ్లిప్ కార్ట్ 22 శాతం డిస్కౌంట్ ను ఇస్తోంది. రూ.49,999గా ఉన్న ధరను రూ.38,999కే అందిస్తోంది. ఇది అల్ట్రా హెచ్ డీ 4K సపోర్ట్ చేసే టీవీ. ఇది 2 జీబీ ర్యామ్, 16 జీబీ రోమ్ తో వస్తుంది. దీనిపై కోటక్ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులతో అదనంగా రూ.3 వేల వరకు తగ్గింపు పొందవచ్చు.
Mi 4X Ultra HD(4K):
ఈ టీవీపై గరిష్టంగా 16 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. రూ.41,999గా ఉన్న ధరను రూ.34,999కే అందిస్తోంది. అదనంగా రూ.4 వేల వరకు డిస్కౌంట్స్ పొందవచ్చు. ఇది 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ తో వస్తోంది. ఇది 4Kని సపోర్ట్ చేసే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్‌టీవీ.
Sony X74 Bravia:
సోనీ స్మార్ట్ టీవీపై ఫ్లిప్ కార్ట్ భారీగానే డిస్కౌంట్ ను ప్రకటించింది. గరిష్టంగా 29 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. రూ.84,900 ధర ఉన్న టీవీని రూ.59,999కే అందిస్తోంది. అదనంగా రూ.5 వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. ఈ టీవీ 4K ప్రాసెసర్ తో వస్తుంది. యాండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది.
స్మార్ట్ టీవీని రూ.7,499 నుంచి ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. బేసిక్ కాకుండా మంచి ఫీచర్లతో స్మార్ట్ టీవీ కావాలంటే దాదాపు రూ.13 వేలలో కొనుగోలు చేయవచ్చు. మరిన్ని ఆఫర్లు, వివరాల కోసం ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ ను సందర్శించండి. ఈ బిగ్ సేవింగ్ డే సేల్ జనవరి 17- 22 వరకు కొనసాగనుంది.