ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ పేరిట భారీ ఆఫర్లు ప్రకటించింది. ఈ సేల్.. మంగళవారం(ఏప్రిల్ 12) నుంచి 14వ తేదీ వరకు 3 రోజుల పాటు సాగనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లతో పాటు పలు ఎలక్ట్రానిక్స్ వస్తువులపై డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లు ఉండనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు 12 గంటలు ముందుగా అంటే ఈ సేల్ ఇప్పటికే మొదలుకాగా.. యూజర్లందరికీ ఇవాళ అందుబాటులోకి వచ్చింది.
ఈ సేల్‌లో ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి ఏవైనా వస్తువులు కొంటే 10 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. కొన్ని మొబైళ్లకు డెబిట్ కార్డుపైనా ప్రత్యేక ఆఫర్ వర్తించనుంది. సామ్‌సంగ్, షావోమి, రియల్‌మీ, మోటోరోలా.. వంటి మరికొన్ని బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు ఆఫర్‌తో పాటు కొన్ని స్మార్ట్‌ఫోన్‌లపై అదనపు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. అలాగే ఏ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొన్నా కూడా కొన్ని మొబైళ్లపై తగ్గింపు వర్తిస్తుంది.
బిగ్ సేవింగ్ డేస్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై ఉన్న కొన్ని బెస్ట్ డీల్స్ మీకోసం..
మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ 5జీ:
ఈ మొబైల్ అసలు ధర రూ. 24,999 కాగా.. 22 శాతం డిస్కౌంట్‌తో రూ.19,499కే సేల్‌లో ఉంటుంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఆఫర్‌ను కలుపుకొని రూ.18,749కే ఈ మొబైల్‌ను కొనవచ్చు. 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడి డిస్‌ప్లే, మీడియాటెక్ డైమన్సిటీ 800యూ ప్రాసెసర్‌తో మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ 5జీ వస్తోంది.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ: (6జీబీ+128జీబీ)
ఈ మొబైల్ అసలు ధర రూ. 23,999 కాగా.. 29 శాతం డిస్కౌంట్‌తో రూ.16,999కే సేల్‌లో ఉంటుంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఆఫర్‌ను కలుపుకొని రూ.14,999కే ఈ మొబైల్‌ను కొనవచ్చు.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ: (4జీబీ+128జీబీ)
ఈ మొబైల్ అసలు ధర రూ. 22,999 కాగా.. 29 శాతం డిస్కౌంట్‌తో రూ.15,999కే సేల్‌లో ఉంటుంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఆఫర్‌ను కలుపుకొని రూ.13,999కే ఈ మొబైల్‌ను కొనవచ్చు. స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్, 6.6 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను ఈ మొబైల్ కలిగి ఉంది.
పోకో ఎం4 ప్రో 5జీ:
రూ.16,499 ప్రారంభ ధర ఉన్న పోకో ఎం4 ప్రో 5జీ మొబైల్ ప్రారంభ ధర ఈ సేల్‌లో రూ.14,999కు తగ్గనుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో కొంటే అదనంగా రూ.1000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే రూ.13,999కే దీన్ని కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మీ 9ఐ(10,999), సామ్‌సంగ్ ఎఫ్12(8,499), రియల్‌మీ 8(11,499).. వీటితో పాటు రెడ్‌మీ నోట్ 10టీ 5జీ, రియల్‌మీ 9ప్రో+ 5జీ, రియల్‌మీ 8ఎస్ 5జీ, మోటో జీ71 5జీ, ఇన్ఫినిక్స్ నోట్ 11ఎస్ వంటి పలు మొబైళ్లపై సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా ఆఫర్లు ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్.
ఇది కూడా చదవండి: ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్..! ఐఫోన్ కోనాలనుకుంటున్నవారికి పండగే..!