దేశంలో ఫెస్టివల్ సీజన్ ప్రారంభమైంది. దసరా, దీపావళి,క్రిస్ మస్.. ఇలా వరుసగా పండుగలు రానుండడంతో ఈ కామర్స్ సంస్థలు.. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో ప్రత్యేక సేల్‌కు సన్నద్ధమవుతున్నాయి. అందులో భాగంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వార్షిక సేల్ నిర్వహించడానికి సిద్దమైంది. ‘ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2022’ పేరిట సేల్ నిర్వహించనుంది. ఎన్నడూ లేనంతగా.. 90 శాతం వరకూ భారీ డిస్కౌంట్లు ఈ సేల్ లో ఉండనున్నాయి.
వారం రోజుల పాటు..
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2022 సేల్.. సెప్టెంబర్ 23 నుండి సెప్టెంబర్ 30 వరకు వారం రోజుల పాటు కొనసాగనుంది. సేల్ సమయంలో, వినియోగదారులు 12 AM, 8 AM మరియు 4 PMకి ‘క్రేజీ డీల్స్’ పొందవచ్చు. అదేవిధంగా, ఎర్లీ బర్డ్ స్పెషల్స్‌తో రష్ అవర్స్ సేల్, టిక్ టాక్ డీల్స్ వంటివి ఉండనున్నాయి. ‘ఫ్లిప్‌కార్ట్ ప్లస్’ సభ్యులు 24 గంటల ముందుగానే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో అందుబాటులో ఉన్న అన్ని డీల్‌లకు యాక్సెస్ పొందుతారు.
కార్డు ఆఫర్స్:
ఈ సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లపై 10 శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. అలాగే.. నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్స్, ఫ్లిప్ కార్ట్ పే లేటర్ ఆప్షన్ వంటివి అందుబాటులో ఉండనున్నాయి.
బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్స్:
ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్ మరియు యాక్సెసరీస్‌పై 80% వరకూ డిస్కౌంట్లు ఉండనున్నాయి. ఇందులో హెడ్‌ఫోన్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు.. అన్నింటిపై డీల్స్ ఉంటాయి. ఇక.. టీవీలు మరియు అప్లయెన్సెస్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్లు ఉండగా, ఫాషన్ పై 60 నుంచి 90 శాతం వరకూ, బ్యూటీ, టాయ్స్, స్పోర్ట్స్ ప్రొడక్ట్స్ పై 60 నుంచి 80 శాతం వరకూ డిస్కౌంట్లు ఉండనున్నాయి.
ఈ మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్స్..
బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఐఫోన్ ఎస్ఈ 2022, రియల్ మీ 9 5జీ, పోకో సీ31, వివో టీ1 5జీ, శాంసంగ్ ఎఫ్13 వంటి మరికొన్ని కొన్ని స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్ ఉండనున్నాయి. ఏదైనా ఆఫర్ వస్తే.. మొబైల్ కొందామని వేచిచూస్తున్న వారికి ఇదొక సువర్ణావకాశం. ఈ సేల్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.