దేశీయ కుబేరుడు అదానీ పేరు ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటుంది. తాజాగా ఎన్డీటీవీని సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారంటూ దేశవ్యాప్తంగా అదానీ పేరు మారుమ్రోగుతోంది. ఇప్పటికే గనులు, పోర్టులు, విద్యుత్ ప్లాంట్లు, ఎయిర్ పోర్టులు, డిఫెన్స్ రంగంలోనూ అదానీ గ్రూప్ ఎంటరైన విషయం తెలిసిందే. ఇలా అదీ ఇదీ లేదు.. అన్నింటా తమ పాత్ర ఉండేలా అదానీ గ్రూపు దూసుకుపోతోంది.
సిమెంట్ తయారీ రంగంలోనూ తమ ముద్ర వేసేందుకు దూకుడుగా వ్యవహరిస్తోంది. హోల్సిమ్ కు చెందిన భారత యూనిట్లను 10.5 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసి అగ్రగామిగా ఎదగాలని చూస్తోంది. అందుకు కావాల్సిన నిధులన్నీ అప్పుల ద్వారానే సమీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు అదానీ గ్రూప్ విషయంలో వెలుగు చూసిన వార్త దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు తెర తీసింది.
అదేంటంటే ‘అదానీ గ్రూప్: డీప్లీ ఓవర్‌లివరేజ్డ్’ అంటూ ఫిచ్ గ్రూప్ నకు చెందిన క్రెడిట్ సైట్స్ నివేదికను విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న వ్యాపారాలు మాత్రమే కాదు.. కొత్తగా తీసుకొచ్చే వ్యాపారుల సైతం అన్నీ అప్పులమీదే ఆధారపడుతున్నట్లు తెలియజేశారు. క్రెడిట్ సైట్స్ నివేదిక ప్రకారం.. విస్తరణలో భాగంగా అదానీ గ్రూప్ గత కొన్నేళ్లుగా ప్రస్తుత వ్యాపారాలకు అస్సలు సంబంధం లేని రంగాల్లో అడుగుపెడుతోంది. అలా చేయడం ద్వారా రుణ పరిమితులు, మనీ ఫ్లోపై ఒత్తిడి పెరుగుతోంది.
2021-22లో అదానీ గ్రూపునకు చెందిన 6 నమోదిత కంపెనీల స్థూల రుణాలు రూ.2,30,900 కోట్లుగా ఉన్నాయి. నగదు నిల్వలు లెక్కించిన తర్వాత అదానీ గ్రూపు నిరకర రుణాలు రూ.1,72,900 కోట్లుగా తేలింది. అన్ని వాపారాల్లో దూకుడుగా ఇన్వెస్ట్ మెంట్ చేస్తున్న నేపథ్యంలో లివరేజీ, సాల్వెన్సీ నిష్పత్తులు పెరుగుతున్నట్లు క్రెడిట్ సైట్స్ పేర్కొంది. ఆ విషయం మాత్రం కాస్త ఆందోళన కలిగించేదిగానే ఉందంటున్నారు.
అయితే పదేళ్ల తర్వాత అదానీ గ్రూపు పరిస్థితి ఏంటనే దానిపై కూడా స్పష్టత లేదంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆరు కంపెనీలకు ఛైర్మన్ గా ఉన్న అదానీ పదేళ్ల తర్వాత ఛైర్మన్ గా కొనసాగకపోవచ్చు. ఆయన వారసులు ఆయన అంత దూకుడుగా వ్యవహరించలేకపోవచ్చు అనే ప్రశ్నలను సైతం లేవనెత్తారు. గ్రూపు కంపెనీల్లో ఆయన లేకపోతే మాత్రం మేనేజ్మెంట్ సామర్థ్యం సరిపోదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నివేదిక వచ్చిన నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు డీలాపడ్డాయి. అదానీ గ్రూపు అప్పులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
All the seven #AdaniGroup companies were hammered on the stock exchanges today after a CreditSights report outlined that it is ‘deeply over-leveraged.’
In the first half of trading today, Adani Group lost over ₹94,000 crore in value, with the top loser being #AdaniGreen. pic.twitter.com/vU3xS5xRzS
— Business Insider India🇮🇳 (@BiIndia) August 23, 2022