మంగళవారంతో మే నెల ముగిసి.. బుధవారం నుంచి జూన్ నెల మొదలవుతున్నది. ఈ నేపథ్యంలో జూన్ నెలలో ఆర్థిక పరమైన అంశాల్లో కొన్ని కీలక మార్పుల చోటు చేసుకొనున్నాయి. ఈ క్రమంలో మారే ఆర్థిక అంశాల గురించి ప్రజలు తప్పనిసరిగా తెలుసుకోవాలని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇంటి రుణాలపై వడ్డీరేటు పెంపు, బంగార ఆభరణాలపై హోల్ మార్కింగ్ వంటి వాటిల్లో మార్పులు జరగబోతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఇంటి రుణం తీసుకున్న వారు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, వాహనాల యజమానులపై కూడా ఆర్థిక మార్పుల ప్రభావం తప్పనిసరిగా పడుతుంది. జూన్ నుంచి మార్పులు చోటు చేసుకోనున్న ప్రధాన ఆర్థికాంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దామా..!
SBI హోమ్ లోన్ వడ్డీ రేట్లు 6.55% నుంచి 7.05 శాతానికి పెరిగాయి. AXIS బ్యాంక్ ఖాతా కనీసం నిల్వ పరిమితి రూ.25వేలకు పెరిగింది. థర్డ పార్టీ మోటర్ ఇన్సూరెన్స్ ప్రీమియం అమల్లోకి వచ్చింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్.. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తోంది. 3 ఉచిత నగదు విత్ డ్రాల తర్వాత ప్రతి డిపాజిట్, ఉపసంహరణపై రూ.20+జీఎస్టీ, మినీ స్టేట్ మెంట్ కి రూ.5+ జీఎస్టీ చెల్లించాలి. ఈ చార్జీలు జూన్ 15 నుంచి అమలవుతాయి. బంగారం ఆభరణాలపై రెండో దశ హాల్‌మార్కింగ్ ప్రక్రియ జూన్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నది. పలు రకాల క్యారట్ల బంగార ఆభరణాలపై తప్పనిసరిగా హోల్ మార్కింగ్ చేయాల్సిందే.
ఇదీ చదవండి: యూట్యూబర్ సక్సెస్ స్టోరీ! కోట్ల జీతం ఇస్తామన్నా వద్దనుకున్నాడు!