కస్టమర్ల ఆర్థిక భయాలు.. బ్యాంకులను నిట్ట నిలువునా చీల్చేస్తున్నాయి. ఖాతాదారులు బ్యాంకుల్లో దాచుకున్న డబ్బంతా ఒక్కసారిగా విత్‌డ్రా చేతుండడంతో.. ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం కష్టతరమవుతోంది. దీంతో దివాళా తీస్తున్నాయి.
అగ్రరాజ్యంలో బ్యాంకింగ్ సంక్షోభం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో దిగ్గజ బ్యాంకులన్నీ ఒక్కొక్కటిగా దివాళా తీస్తున్నాయి. తొలుత సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ దివాలా తీయగా, ఇప్పుడు ఆ జాబితాలోకి మరో బ్యాంక్ వచ్చి చేరింది. అమెరికాలో మూడో అతిపెద్ద బ్యాంకు అయిన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ మూతపడింది. దీంతో ఆ బ్యాంకు ఆస్తులన్నీ జేపీ మోర్గాన్ బ్యాంక్ స్వాధీనం చేసుకుంది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌కు చెందిన మొత్తం 84 బ్రాంచులను జేపీ మోర్గాన్ ఛేజ్ అండ్ కో దక్కించుకుంది. ఆ వివరాలు..
బ్యాంకుల పతనానికి ఆర్థిక మాంద్యం భయాలు ఒకటైతే, డిపాజిటర్లు తమ డబ్బంతా ఒక్కసారిగా విత్‌డ్రా చేసుకోవడం ఒక కారణం అవుతోంది. ఇందుకు ఆయా బ్యాంకులు తీసుకునే కొన్ని నిర్ణయాలు కూడా ఒక కారణమనే చెప్పాలి. నష్టాలను పూడ్చుకునేందుకు, ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు బ్యాంకులు సెక్యూరిటీలను విక్రయించేందుకు మక్కువ చూపుతున్నాయి. ఇది వినియోగదారుల్లో పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో వారు తమ డిపాజిట్లను వెనక్కు తీసుకుంటున్నారు. ఇలా ఉన్న డబ్బంతా విత్‌డ్రా అవ్వడంతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించలేక బ్యాంకులు చేతులెత్తేస్తున్నాయి. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ కు ఇదే పరిస్థితి నెలకొనగా.. జేపీ మోర్గన్ సంస్థ ఆ బ్యాంకు ఆస్తులను టేకోవర్ చేసుకుంది.
🚨BREAKING: First Republic Bank Is Seized & Sold to JPMorgan in Second-Largest U.S. Bank Failure
The FDIC avoided another banking crisis by seizing First Republic and selling it to JP Morgan. pic.twitter.com/1fsrqNEXRE
— AZ Capital (@azcapital_ae) May 1, 2023
ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ కస్టమర్లు మార్చిలో సుమారు 100 బిలియన్ల డాలర్లు విత్‌డ్రా చేసుకున్న నేపథ్యంలో బ్యాంకు షేర్లు 75 శాతం పడిపోయాయి. దీంతో సదరు బ్యాంకు దివాళా తీయక తప్పలేదు. ఈ క్రమంలోనే జేపీ మోర్గాన్ ఛేజ్ అండ్ కో దక్కించుకుంది. ఈ విషయాన్ని ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకుకు చెందిన అన్ని డిపాజిట్లు, అసెట్స్‌ను ఇక నుంచి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ జేపీ మోర్గన్ చూసుకోనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించేది. ఇందులో ఎక్కువగా అత్యంత ధనవంతుల ఖాతాలు ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి అమెరికాకు చెందిన సుమారు 11 బ్యాంకులు మార్చి నెలలో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకులోకి 30 బిలియన్ల డాలర్లు ట్రాన్స్‌ఫర్ చేశాయి. అయినప్పటికీ లాభం లేకపోయింది. 1985లో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకును స్థాపించారు.
JPMorgan Chase has solidified itself as the private sector “lender of last resort” w/ purchase of First Republic Bank. $JPM has now acquired 2 biggest bank failures in US history. The only failure bigger than $FRC? Washington Mutual (WaMu) during Great Financial Crisis.@cnbc pic.twitter.com/F1iNe7g2px
— Dominic Chu ✨ (@TheDomino) May 1, 2023