ఆర్థిక క్రమశిక్షణ అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో అత్యవసరం. లేకపోతే భవిష్యత్తులో అనుకోని సంఘటనలు ఎదురైనపుడు.. మనకు ఆర్థిక భరోసా ఉండదు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఇప్పటినుంచే తమ ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేసుకోవడం మంచిది. తద్వారా అవసరమైన సమయంలో మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు. దీంతో మీ డబ్బు భద్రంగా ఉండడంతోపాటు ఆర్థిక భరోసాను కల్పిస్తుంది. అలా డబ్బు పొదుపు చేయడానికి ఉన్న రెండు అనువైన మార్గాలు.. ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్.
కస్టమర్లు వీటిలో పొదుపు చేయడానికి సుముఖంగా ఉన్నప్పటికీ, వీటి మధ్య తేడా తెలియక.. ఎందులో రాబడి ఎక్కువస్తుందో అర్థం కాక గందరగోళానికి గురవుతుంటారు. అటువంటి పరిస్థితిలో, FD, RDకి సంబంధించిన కొన్ని విషయాలు మీకు తెలిస్తే.. ఎక్కడ పెట్టుబడి పెట్టడం మంచిదో మీరే లెక్కించుకోవచ్చు.
ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ మధ్య తేడా:
ఫిక్స్‌డ్ డిపాజిట్ లో.. ఒకేసారి కొంత మొత్తాన్ని పొదుపుచేయాలి. అదే రికరింగ్ డిపాజిట్ లో.. వాయిదాలలో డబ్బు జమ చేయాలి. ఇక్కడ ఒక పాయింట్ ఆలోచించండి. మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులుంటే.. ఫిక్స్‌డ్ డిపాజిట్ ఎంచుకోవడం ఉత్తమం. అదే నెలవారి జీతాల మీద ఆధారపడి, నెల నెల కొంత మొత్తంలో పొదుపు చేయాలనుకునేవారికి.. రికరింగ్ డిపాజిట్ అనువైనది.
ఫిక్స్‌డ్ డిపాజిట్ లో.. 7 రోజుల నుండి 10 సంవత్సరాల కాల వ్యవధి వరకు పొదుపు చేయొచ్చు. అదే రికరింగ్ డిపాజిట్ లో.. 6 నెలల నుండి 10 సంవత్సరాల వరకు పొదుపు చేయొచ్చు. ఇక.. రాబడి పరంగా పోల్చి చూస్తే.. ఫిక్స్‌డ్ డిపాజిట్ మెచ్యూరిటీ ముగిసే సమయానికి వచ్చే వడ్డీ మొత్తం RDపై సంపాదించిన వడ్డీ కంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. ఒకేసారి ఎక్కువ మొత్తాన్ని పొదుపుచేస్తున్నాం కనుక. ఇక్కడ మరో ముఖ్య విషయం..
ఉదాహరణకు.. మీ దగ్గర 5 లక్షలు ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్ లో పెట్టుబడి పెడితే ఎంత రాబడి వస్తుందో చూద్దాం..
ఇప్పుడు రికరింగ్ డిపాజిట్.. నెల నెలా 10,000 రూపాయలు పొదుపు చేయగలరు అనుకుందాం.. 5 సంవత్సరాల తరువాత మీ రాబడి ఎంత ఉంటుందో చూద్దాం..
గమనిక: ఈ లెక్కలు.. మాకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. మీరు పొదపు చేయాలనుకున్నప్పుడు బ్యాంకులను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.