బంగారం కొనాలనుకునేవారికి శుభ పరిణామం అని చెప్పవచ్చు. రోజురోజుకి బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తుంది. ఇవాళ మార్కెట్ లో బంగారం ధర ఎలా ఉందో చూడండి.
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గడిచిన వారం రోజుల్లో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. బంగారం కొనాలనుకునేవారికి సరైన అవకాశం. కొద్ది రోజుల క్రితం రికార్డు స్థాయికి చేరిన పసిడి, వెండి ధరలు ప్రస్తుతం తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా కూడా బంగారం, వెండి ధరలు దిగి వస్తుండడం శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇవాళ అంటే ఫిబ్రవరి 16న దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.
ఇటీవల కాలంలో రెండేళ్ల గరిష్టాన్ని తాకిన బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత వారంలో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. బంగారం కొనేందుకు ఇదే తగిన సమయమని నిపుణులు చెబుతున్నారు. వారం రోజుల్లో బంగారం తులం దగ్గర రూ. 700 మేర తాగింది. వెండి కూడా భారీగా తగ్గింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఒక ఔన్సుకు 1837 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇటీవల కాలంలో 2వేల డాలర్ల సమీపంలో ట్రేడ్ అయిన బంగారం.. ప్రస్తుతం 1841.84 డాలర్ల వద్ద కొనసాగుతుండడం వల్ల బంగారం కొనేవారికి తగిన సమయంగా చెప్పవచ్చు. ఇక వెండి ధర విషయానికి వస్తే.. ప్రస్తుతం 21.75 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడంతో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. డాలర్ పుంజుకోవడంతో బాండ్ ఈల్డ్స్ కు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో బంగారం, వెండి ధరలు పతనమవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన వారం రోజుల్లో 22 క్యారెట్ల బంగారం తులం దగ్గర రూ. 800 మేర తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 52,550గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,310 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 తగ్గింది. ప్రస్తుతం రూ. 53,150 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 160 తగ్గి.. 57,980గా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 52,400గా ఉంది.
నిన్నటితో పోలిస్తే మార్పులు లేవు. అయితే 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80 తగ్గి రూ. 57,160గా ఉంది. నిన్న ఇదే బంగారం రూ. 57,240 ఉంది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో మాత్రం నిన్నటి ధరలే కొనసాగుతున్నాయి. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో వద్ద రూ. 72 వేలు పలుకుతుంది. నిన్న కిలో వెండి ధర రూ. 72,500 ఉండగా.. ఇవాళ రూ. 500 తగ్గింది. ఢిల్లీలో కిలో వెండి దగ్గర రూ. 450 తగ్గింది. ప్రస్తుతం రూ. 69,950 గా ఉంది. బంగారం, వెండి ధరలు ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాబట్టి బంగారం, వెండి కొనాలనుకునేవారికి మంచి పరిణామమని చెప్పవచ్చు. మరి బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.