ఆదాయం లేని వారు కూడా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలా? ఎవరు చేయాలి?

ఆదాయం లేకపోయినా కూడా రిటర్న్స్ దాఖలు చేయాలా? అన్న సందేహం మీకు ఉందా? ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం అనేది ఎవరికి వర్తిస్తుంది? అని మీకు డౌట్ ఉందా? అయితే మీ సందేహాన్ని తీర్చుకోండి.

  • Written By:
  • Publish Date - June 3, 2023 / 07:29 AM IST

ఆదాయం లేని వారు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలా? ఐటీ రిటర్న్స్ ఎవరు ఫైల్ చేయాలి? ఎవరికి వర్తిస్తుంది? ఎంత ఆదాయం దాటితే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి? ఎవరు చేయాలి? అన్న ప్రశ్నలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? ఐతే మీ కోసమే ఈ కథనం. ప్రతీ వ్యక్తికీ వారికి వచ్చే ఆదాయంలో ప్రాథమిక మినహాయింపు అనేది ఉంటుంది. ఈ పరిమితి దాటితే కనుక ప్రతి ఒక్కరూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిందే. అన్ని వనరుల నుంచి వచ్చిన ఆదాయం అనేది ప్రాథమిక మినహాయింపు పరిమితికి మించి ఉంటే ఖచ్చితంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి. జీతం, బ్యాంకు పొదుపు ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీ, డివిడెండ్, అద్దెల ద్వారా వచ్చే ఆదాయం వంటి వాటిని ఒక చోట చేర్చాలి.

60 ఏళ్ల లోపు వయసున్న వారికి రూ. 2.50 లక్షలు ప్రాథమిక మినహాయింపు ఉంటుంది. 60 నుంచి 80 ఏళ్ల వయసున్న వారికి రూ. 3 లక్షలు ప్రాథమిక మినహాయింపు ఉంటుంది. 80 ఏళ్ళు పైబడిన వారికి రూ. 5 లక్షల వరకూ ప్రాథమిక మినహాయింపు అనేది ఉంటుంది. అంటే వీరు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. రూ. 5 లక్షల లోపు ప్రాథమిక మినహాయింపు వర్తించే ఆదాయం ఉంటే సెక్షన్ 87ఏ కింద పన్ను రిబేటు వస్తుంది. అటువంటప్పుడు పన్ను చెల్లించక్కర్లేదు. కానీ వర్తించే ఐటీఆర్ ఫారంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి. విదేశాల్లో ఆస్తి ఉండి.. ఆ ఆస్తి ద్వారా లాభాలు ఆర్జిస్తున్నప్పుడు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం కాకపోయినా కానీ ఐటీ రిటర్న్స్ చేయాల్సిందే. దేశం బయట నిర్వహించే ఏదైనా ఆర్థిక లావాదేవీతో సంబంధం ఉన్నా, విదేశాల్లో బ్యాంకు ఖాతాలు ఉన్నా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయక తప్పదు.

అలానే విదేశీ కంపెనీల షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లలో మదుపు చేసిన వారు కూడా రిటర్న్స్ దాఖలు చేయాల్సిందే. కరెంటు అకౌంట్స్ కి సంబంధించి అన్ని ఖాతాల్లో రూ. కోటి నగదు డిపాజిట్ చేసినా, పొదుపు ఖాతాలన్నిటిలోనూ రూ. 50 లక్షలకు మించి నగదు డిపాజిట్ చేసినా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో మీ ఆదాయం నుంచి మినహాయించిన పన్ను మొత్తం రూ. 25 వేలు దాటితే కనుక ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిందే. విదేశీ ప్రయాణాల కోసం రూ. 2 లక్షలకు మించి ఖర్చు చేసిన సందర్భంలో ఐటీ రిటర్న్స్ తప్పనిసరి చేయించాలి. పన్ను చెల్లించే వ్యక్తి అతను మరియు అతని కుటుంబ సభ్యులు చేసిన విదేశీ ప్రయాణ వివరాలను ఐటీఆర్ లో నమోదు చేయాల్సి ఉంటుంది.

ఒక ఆర్థిక ఏడాదిలో రూ. లక్షకు మించి విద్యుత్ బిల్లు చెల్లిస్తే కనుక ఐటీ రిటర్న్స్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. మీ ఆదాయం ఆదాయపు పన్ను స్లాబ్ కంటే తక్కువ ఉంటే కనుక నిల్ ఐటీ రిటర్న్ అనేది దాఖలు చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ఎటువంటి ఆదాయం లేదు అని చెప్పాల్సి ఉంటుంది. దీని వల్ల మీరు ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. తక్కువ ఆదాయం ఉన్నా, ఆదాయం లేకున్నా కూడా ఐటీ రిటర్న్స్ అనేవి చేయిస్తే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed