ఉద్యోగులకు ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజషన్ (ఈపీఎఫ్ఓ) శుభవార్త తెలిపింది. అధిక పింఛన్ కోసం దరఖాస్తు గడువును జూన్ 26వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ అవకాశాన్ని గతంలో మిస్ చేసుకున్న వారు ఉంటే.. వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగులకు ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజషన్ (ఈపీఎఫ్ఓ) గుడ్ న్యూస్ చెప్పింది. అధిక పెన్షన్ దరఖాస్తు గడువు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అధిక పింఛన్ కోసం దరఖాస్తు గడువును జూన్ 26వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. నిజానికి మే 3తో ఆ గడువు ముగిసింది. అయితే, కొద్ది రోజులు మాత్రమే గడువు ఇచ్చి సంబంధిత లింకును వెబ్‌సైట్ నుంచి తొలగించడంతో పలువురు పెన్షనర్లు ఆందోళన చెందారు. మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవించారు. ఈ క్రమంలోనే ఈపీఎఫ్ఓ మరో అవకాశం ఇచ్చింది.
ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995 (EPS 95) ప్రకారం.. 2014కు ముందు ఉంద్యోగంలో చేరి.. వాస్తవిక వేతనం (ఈపీఎఫ్‌వో గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేలకన్నా ఎక్కువ) పొందుతూ.. ఈపీఎఫ్ చందా చెల్లిస్తున్న కార్మికులు, పింఛనుదారులు అధిక పింఛన్ పొందడానికి అర్హులు. ఈ విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కలుగజేసుకొని.. అర్హతగల సభ్యులందరికీ అధిక పెన్షన్‌ను ఎంచుకోవడానికి నాలుగు నెలల సమయం ఇవ్వాలని ఆదేశించింది. గతేడాది నవంబర్ 4న సుప్రీంకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలోనే ఈపీఎఫ్ఓ మే 3వరకు దరఖాస్తు గడువు ఇచ్చింది. ఆ గడువు నేటితో ముగియగా, మరోసారి దానిని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అధిక పెన్షన్ కోసం 12 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.
#JustIn | #EPFO extends deadline to apply for higher pension till June 26. pic.twitter.com/86AQJCAVuS
— Business Standard (@bsindia) May 2, 2023