మీరు ఉద్యోగం చేస్తున్నారా? మీకు పిఎఫ్ ఖాతా ఉందా? అయితే మీరు రూ. 7 లక్షలు పొందే అవకాశం కల్పిస్తోంది ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఎటువంటి ప్రీమియం చెల్లించకుండా పూర్తి ఉచితంగా రూ. 7 లక్షలు పొందొచ్చు.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేసే వారికి కంపెనీలు పిఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలను కల్పిస్తాయి. అయితే మీరు ఉద్యోగం చేస్తున్నట్లైతే, మీకు పిఎఫ్ ఖాతాదారులైతే రూ.7 లక్షలు పొందే సౌలభ్యాన్ని కల్పిస్తోంది ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే రూ. 7లక్షల ఇన్సూరెన్స్ పొందే అవకాశాన్ని ఈపిఎఫ్ఒ కల్పిస్తుంది. ఎంప్లాయి డిపాజిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడిఎల్ఐ) పథకం ద్వారా పిఎఫ్ ఖాతాదారలకు ఈ సౌకర్యాన్ని కల్పించింది. పిఎఫ్ ఖాతా ఉంటే చాలు ఈడిఎల్ఐ పథకానికి అర్హత సాధించవచ్చు. దురదృష్టవశాత్తు ఉద్యోగి మరణిస్తే అతని కుటుంబసభ్యులకు రూ. 7 లక్షల పరిహారం వస్తుంది.
ఈడిఎల్ఐ ఒక బీమా పథకం. నెలకు రూ. 15000 లోపు బేసిక్ సాలరీ ఉన్న ఉద్యోగులందరికి ఈ పథకం వర్తిస్తుంది. ఈపిఎఫ్ ఖాతాదారుడు మరణానికి ముందు సంవత్సర కాలంలో ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో పనిచేసి విధుల్లో ఉండగా మరణించినట్లైతే వారి కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పించాలని ఈపిఎఫ్ నిర్ణయించింది. ఈ పథకం ద్వారా రూ. 2.5 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు ఉచితంగా బీమా పొందవచ్చు. ఎంప్లాయి డిపాజిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా ప్రయోజనాలు పొందాలంటే తప్పనిసరిగా ఈ – నామినేషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. నామిని వివరాలను ఈపిఎఫ్ ఖాతాలో పొందుపరచాల్సి ఉంటుంది. ఈపిఎఫ్ ఖాతాదాడుడు సర్వీసులో ఉండగా చనిపోతే నామినీ ఈ బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈడిఎల్ఐ పథకానికి ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. కంపెనీ యజమాని మాత్రం బేసిక్ సాలరీలో 0.5 శాతం లేదా గరిష్టంగా రూ. 75 ప్రతి నెల చెల్లించాల్సి ఉంటుంది.