నేటికాలంలో చాలా మంది ఏదైనా వ్యాపారం చేసి.. ఉద్యోగంలో వచ్చే జీతానికి మించి ఆదాయం పొందాలని కోరుకుంటారు. అలాంటి వారిలో మీరు కూడా ఉన్నారా? అయితే ఈ బిజినెస్ ఐడియా మీ కోసమే. ఈ వ్యాపారం చేస్తే ఉద్యోగంలో వచ్చే జీతానికి మించిన ఆదాయం వస్తుంది.
ప్రతి ఒక్కరు జీవితంలో ఉన్నతస్థితిలోకి వెళ్లాలని కలలు కంటారు. ఈ క్రమంలో చాలామంది మంచి ఉద్యోగం సాధించి.. జీవితాన్ని హాయిగా గడుపుతుంటారు. అయితే ఇలా ఉద్యోగాలు చేసేవారిలో కొందరికి అసంతృప్తి ఉంటుంది. తాము చేస్తున్న జాబ్ మీద బోర్ కొడుతుంది. ఏదైనా వ్యాపారం చేసి.. ఉద్యోగంలో వచ్చే జీతానికి మించి ఆదాయం పొందాలని కోరుకుంటారు. అలాంటి వారిలో మీరు కూడా ఉన్నారా? అయితే ఈ బిజినెస్ ఐడియా మీ కోసమే. ఈ వ్యాపారం చేస్తే ఉద్యోగంలో వచ్చే జీతానికి మించిన ఆదాయం వస్తుంది. మరి.. ఆ వ్యాపారం ఏమిటో.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
నేటికాలంలో చాలామంది యువత వ్యవసాయం వైపు ఆసక్తి చూపుతున్నారు. లక్షల జీతాలు ఇచ్చే ఉద్యోగాలను సైతం పక్కన పెట్టి వ్యవసాయనికే ప్రాధాన్యత ఇస్తున్నారు. మంచి ఉద్యోగాలు వదిలేసి వ్యవసాయంలో చేరి లక్షలాది రూపాయలు సంపాదించే వారు మన దగ్గర చాలా మంది ఉన్నారు. కొందరు జీలకర్ర పంటను పండిచటం లేదా దానిపై వ్యాపారం చేయడం ద్వారా మంచి ఆదాయాన్ని అర్జిస్తారు. ఎక్కువ మంది ఇళ్లలోని వండగదిలో కనిపించే వాటిల్లో ప్రధానమైవి మసాలా దినుసులు. వీటికి చాలా మంది అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ మసాల దినుసుల్లో జీలకర్ర అతిముఖ్యమైనది. జీలకర్ర పంటను పండించడం ద్వారా మీరు డబ్బులు సంపాదించవచ్చు.
కారణం మార్కెట్ లో జీలకర్రకు విపరీతమైన డిమాండ్ ఉంది. జీలకర్రను వంటలతో పాటు ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఎప్పటికీ గిరాకీ ఉండే మసాలా దినుసుల్లో జీలకర్ర ఒకటి. ఐదెకరాల్లో ఈ పంటను సాగుచేస్తే..2 లక్షల ఆదాయం పొందవచ్చ. జీలకర్ర మొక్క 30 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పొడి ఇసుకతో కూడిన లోమ్ నేలలో పండుతుంది. జీలకర్ర పంట చేతికి రావడానికి దాదాపు 110 నుంచి 115 రోజుల సమయం పడుతుంది. జీలకర్ర మొక్క ఎత్తు 15 నుండి 50 సెం.మీ వరకు పెరుగుతుంది. మన దేశంలో జీలకర్రను అక్టోబర్ నుండి నవంబర్ వరకు సాగుచేస్తారు.
దేశంలోని జీలకర్రలో ఎక్కువ శాతం గుజరాత్, రాజస్థాన్‌లలోనే పండిస్తున్నారు. సాధారణంగా మార్చిలో తాజా పంట మార్కెట్‌కు వస్తుంది. మీరు ఒక హెక్టారులో 7 నుంచి 8 క్వింటాళ్ల విత్తనాన్ని నాటుకోవచ్చు. హెక్టారుకు రూ.30 వేల నుంచి 35 వేల వరకు పెట్టుబడి వస్తోంది. జీలకర్ర కిలోకు రూ.100 అనుకుంటే హెక్టారుకు రూ. 40-రూ.45 వేల రూపాయల వరకు లభిస్తుంది. ఐదెకరాల విస్తీర్ణంలో జీలకర్ర సాగు చేస్తే రూ.2 లక్షల నుంచి రూ. 2.5 లక్షల వరకు లాభం చేకూరుతుంది. అయితే మీరు జీలకర్ర పంట పండించలేకపోతే.. మరో అవకాశం ఉంది. అదే జీలకర్రతో హోల్ సేల్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. జీలకర్రను.. ధాన్యం మార్కెట్ల నుంచి లేదా ఎక్కువగా పండించే.. గుజరాత్, రాజస్థాన్ ల నుంచి కొనుగోలు చేయవచ్చు.
అనంతరం చిల్లర వ్యాపారులకు విక్రయించవచ్చు. అంతేకాక మీరే స్వయంగా జీలకర్రను ప్యాక్ చేసి విక్రయించవచ్చు. ఇందుకోసం పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేదు. దీనిని ఇంట్లోనే ప్రారంభించవచ్చు.. అలానే ఇది తక్కువ ఖర్చుతో కూడిన వ్యాపారం. అయితే మీరు పెద్ద ఎత్తున బ్రాండ్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించాలంటే మాత్రం కంపెనీ పేరు రిజిస్టర్ చేయించుకోవాలి. అలానే స్థలం, కార్మికులు ఇతర ముడిసరకుల కోసం చాలా పెట్టుబడి అవసరమవుతుంది. అయితే ఇది వివిధ మార్గాలో మాకు అందిన సమాచారం ప్రకారం ఇవ్వడం జరిగింది. ఏదైన వ్యాపారం చేయాలంటే.. ఆ వ్యాపారానికి సంబంధించిన నిపుణుల సలహాలు తీసుకుని ప్రారంభించడం మంచిది. మరి.. ఈ బిజినెస్ ఐడియాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.