దేశంలో పెద్ద నోట్ల రద్దు తరువాత ఆన్లైన్ పేమెంట్స్ పెరిగాయి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే..వంటి ఆన్లైన్ పేమెంట్ యాప్స్ ని ఉపయోగిస్తున్నారు. అలాంటి వారికి ఆన్లైన్ పేమెంట్ యాప్ గూగుల్ పే గుడ్ న్యూస్ చెప్పింది. ఈ యాప్ ని ఉపయోగించే యూజర్లకి లక్ష వరకు పర్సనల్ లోన్ పొందే అవకాశాన్ని అందుబాటులో తెచ్చింది. దీని కోసం మీరు మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే రూ.లక్ష వరకు లోన్ పొందడానికి అర్హులు. డీఎంఐ ఫైనాన్స్ అనే కంపెనీ గూగుల్ పే కస్టమర్ల కోసం పర్సనల్ లోన్ ఆఫర్ ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో యూజర్లు సులభంగా.. నిమిషాల్లోనే లోన్ పొందవచ్చు.
DMI Finance partners with @GooglePayIndia to offer an innovative digital personal loan product to make credit accessible to users of Google Pay.#InstantLoan #PersonalLoan pic.twitter.com/TCQ0YdVqCr
— DMI Finance (@DMIFinance) February 14, 2022
మంచి సిబిల్ స్కోర్ కలిగియున్న కస్టమర్లు రూ.లక్ష వరకు రుణం పొందొచ్చు. తీసుకున్న రుణాన్ని 36 నెలలలోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 15000 కు పైగా ఏరియాల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ముందుగా డీఎంఐ ఫైనాన్స్ కంపెనీ.. ప్రిక్వాలిఫైడ్ యూజర్లను ఎంపిక చేసుకుంటుంది. వీరికి గూగుల్ పే ద్వారా లోన్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. నిమిషాల వ్యవధిలోనే లోన్ డబ్బులు బ్యాంక్ ఖాతాకు వచ్చి చేరతాయి. ఇక్కడ గూగుల్ పే వాడే ప్రతి ఒక్కరికీ లోన్ సదుపాయం అందుబాటులో ఉండకపోవచ్చు. క్రెడిట్ స్కోర్ బాగున్న వారికే రుణం లభించే అవకాశం ఉంటుంది.
ఈ విషయంపై.. డీఎంఐ ఫైనాన్స్ జాయింట్ ఎండీ, కోఫౌండర్ శ్రీవాశిష్ చటర్జీ మాట్లాడుతూ.. గూగుల్ పే యూజర్లకు పారదర్శకంగా, త్వరితగతిన రుణాలు అందించేందుకు పని చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ఈ సదుపాయాన్ని మరింత మందికి అందిస్తామని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ ద్వారా కేవలం నిమిషాల్లో.. కొన్ని క్లిక్స్‌తోనే రుణం పొందొచ్చని తెలిపారు.