Discounts On Cars In India For July 2022: కొత్తగా కారు కొనుక్కోవాలనుకునే వారికి పలు కార్ల కంపెనీలు శుభవార్త చెప్పాయి. కార్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి. 20వేల రూపాయలనుంచి 70 వేల రూపాయల దాకా తగ్గింపును ఇచ్చాయి. అయితే, ఈ తగ్గింపు ధరలు కేవలం జులై నెల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ప్రముఖ కార్ల కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా.. ఆల్టో కారుపై దాదాపు 29వేల వరకు, ఎస్‌ప్రెసో కారుపై రూ. 28వేలు, ఈకో మోడల్‌పై రూ. 22వేలు సెలెరియా కారుపై ఎక్కువగా రూ. 54 వేలు, వేగనార్ కారుపై రూ. 44 వేలు, స్విఫ్ట్ కారుపై రూ 29వేలు, డిజైర్ కారుపై రూ.17,500 డిస్కౌంట్‌ను ప్రకటించింది.
హోండా కంపెనీ కూడా తమ కస్టమర్లకు భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. హోండా సిటీ 5వ జనరేషన్ కారుపై రూ. 27,396, హోండా డబ్ల్యూఆర్‌వీ కారుపై రూ. 27 వేలు, హోండా జాజ్ కారుపై రూ. 25 వేలు, హోండా అమేజ్ మోడల్‌పై అయితే రూ. 8 వేలు, హోండా సిటీ 4వ జనరేషన్ కారుపై రూ. 5 వేల వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు.
టాటా మోటార్స్ తమ కార్లపై ఏకంగా రూ. 70 వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. టాటా హారియర్ కారుపై రూ. 70 వేలు, టాటా సఫారి కారుపై రూ. 40 వేలు, టాటా నెక్సన్ కారుపై రూ. 15 వేలు, టాటా టిగోర్ కారుపై అయితే రూ. 33 వేల వరకు, టాటా టియాగో కారుపై అయితే రూ. 28 వేల వరకు, టాటా అల్ట్రోజ్ కారుపై అయితే రూ.10 వేల తగ్గింపు ఉంది. మరి, కార్ల కంపెనీలు ప్రకటించిన ఈ బంపర్ ఆఫర్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Jio: జియో కస్టమర్లకు సూపర్ ఛాన్స్.. రూ.20కే 28GB ఎక్స్‌ట్రా డేటా..!