1జీ.. 2జీ అంటూ మొబైల్ టెక్నాలజీ బుడిబుడి అడుగులతో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత 3జీతో వేగం పెంచుకొని, సరికొత్త సాంకేతిక యుగంలోకి ప్రవేశించింది. సెల్ ఫోన్‌తో దేశాన్ని డిజిటల్‌మయం చేసింది. ఆ వెంటే వచ్చిన 4జీ అద్భుత వేగంతో మానవ జీవితాలపై తిరుగులేని ముద్ర వేసింది. స్మార్ట్ ఫోన్ ద్వారా యావత్ ప్రపంచాన్ని అరచేతుల్లోకి తీసుకొచ్చింది. వన్, టూ, త్రీ, ఫోర్.. అంటూ పరుగులు తీసి, ప్రస్తుతం ఐదో తరానికి చేరుకుంది. మరి.. ఈ ఐదో తరం వల్ల మానవాళికి ముప్పు పొంచివుందా? నష్టాలు తప్పవా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
ఎన్నో ఏండ్ల నిరీక్షణకు తెరదించుతూ దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీ వేదికగా శనివారం నాడు ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ను ప్రారంభించిన మోదీ… 5జీ సేవలను అధికారికంగా ఆవిష్కరించారు. వినియోగదారుల కోసం టెలికం సంస్థలు అక్టోబర్ నెలాఖరు నుంచి కమర్షియల్ 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తేనున్నాయి. అయితే ముందుగా కొన్ని మెట్రో నగరాల్లోని వినియోగదారులకు 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి రానుంది. తొలుత రియలన్స్ జియో, ఎయిర్‌టెల్ ఈ నెలాఖరులోగా 5జీ నెట్‌వర్క్‌ను కమర్షియల్‌గా లాంచ్ చేయనున్నాయి. ఈ క్రమంలో 5జీ టెక్నాలజీ వల్ల మానవాళికి ముప్పు ఉంటుందన్న వార్తలు వస్తున్నాయి. రేడియేషన్ ప్రభావం ఒక్కటే కాదు.. 4జీ కంటే ఎన్నో రెట్లు వేగవంతమైన టెక్నాలజీ ఉన్నప్పుడు మన డేటా హ్యాకర్ల చేతికి చిక్కితే ఏమైనా ఉందా! అంటూ నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
రేడియేషన్ ప్రభావం:
‘సెల్‌ఫోన్ టవర్ల నుంచి, మొబైల్స్ నుంచి వెలువడే రేడియేషన్ మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?’ అనే ప్రశ్న దశాబ్ద కాలంగా వినిపిస్తున్నదే. దీనికి స్పష్టమైన సమాధానాలు మాత్రం లేవు. సెల్‌ఫోన్ మొహానికి దగ్గరగా ఉన్నప్పుడు మెదడు మీద దుష్ప్రభావాలు ఉంటాయని, అతిగా వాడుతుంటే ఒళ్ళు నొప్పులొస్తున్నాయని, ప్యాంట్ జేబులో పెట్టుకుంటే వీర్యకణాలు తగ్గిపోతున్నాయని, క్యాన్సర్ లాంటి ప్రాణాంతక సమస్యలు వస్తున్నాయనీ.. రకరకాల అభిప్రాయాలు ప్రచారంలో అయితే ఉన్నాయి.
5జీ వల్ల కలిగే సమస్యలు:
కంపెనీల చేతిలోకి యూజర్ల పర్సనల్ డేటా:
5G ఎలా పనిచేస్తుంది
5జీ.. అత్యాధునిక సాంకేతికతతో పనిచేస్తుంది. పైగా రేడియో తరంగాలను సమృద్ధిగా, సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. ‘నెట్‌వర్క్ స్లైసింగ్’ అనే ప్రక్రియ ద్వారా సిమ్‌కార్డు అనేక తరంగాలను ఒకేసారి వినియోగించుకుంటుంది. ఇలాంటి మార్పులతో అసాధారణ ఫలితాలు కనిపిస్తాయి.
ధర ఎలా ఉండొచ్చు?
విశ్లేషకుల అంచనాల ప్రకారం 5జీ అందుబాటులోకి రాగానే దాన్ని అందుపుచ్చుకునేందుకు 67 శాతం మంది సిద్ధంగా ఉన్నారు. మరి, ధరలు అందుకు అనుమతిస్తాయా లేదా అన్నది చూడాలి. 4జీతో పోల్చుకుంటే 5జీ సేవలు కచ్చితంగా ఖరీదే! అయితే, పారిశ్రామిక వర్గాలనుంచి ఎక్కువ వసూలు చేస్తే సాధారణ వినియోగదారుల భారాన్ని తగ్గించవచ్చనే ఆలోచనలో టెలికాం కంపెనీలు ఉన్నాయట. అంతేకాదు, 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాక కూడా 4జీ అందుబాటులో ఉంటుందని హామీ ఇస్తున్నాయట. పైగా, మారుతున్న సాంకేతికత వల్ల 4జీ వేగం కూడా పెరిగే అవకాశం ఉంది.