డబ్బుల విషయంలో కొందరు చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. ఖర్చు పెట్టే ప్రతి పైసా విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. డబ్బుల విలువ తెలిసిన వాళ్లే ఇలా వ్యవహరిస్తారు. అయితే ఇంకొందరు మాత్రం మనీని మంచి నీళ్లలా ఖర్చు చేస్తుంటారు. దుబారా ఖర్చులతో ఉన్నది కూడా పోగొట్టుకుంటారు. డబ్బుల విషయంలో సామాన్యులే కాదు.. బిజినెస్మెన్లు కూడా ఒక్కో విధంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు బడాబాబులు రూపాయి ఖర్చు చేయడానికి కూడా ఎంతో ఆలోచిస్తారు. కానీ మరికొందరు మాత్రం రూ.వందల కోట్లను ఈజీగా ఖర్చు చేస్తారు. అయితే ఇంకొందరు మాత్రం డబ్బులతో పాటు తెలివితేటలను పెట్టుబడిగా పెట్టి రెట్టింపు మొత్తంలో సంపాదిస్తారు. అలాంటి ఓ వ్యాపారవేత్తే ధర్మేష్ షా. ప్రముఖ ఇండో-అమెరికన్ బిజినెస్‌మన్ అయిన ధర్మేష్.. 2006లో హబ్స్పాట్ అనే సంస్థను నెలకొల్పారు. బ్రియాన్ హల్లిగన్తో కలసి ఈ కంపెనీని ఏర్పాటు చేశారు ధర్మేష్.
ధర్మేష్ నెలకొల్పిన హబ్స్పాట్ సంస్థ సాఫ్ట్వేర్ ప్రాడక్ట్స్‌కు సంబంధించిన మార్కెటింగ్ తదితర వ్యవహారాలను చూసుకుంటుంది. ఈ కంపెనీని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్న ధర్మేష్.. ఆన్స్టార్టప్స్.కామ్ అనే వెబ్సైట్లో బ్లాగ్లు రాస్తుంటారు. ఆ బ్లాగ్‌కు 9 లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. సుమారు రూ.8,200 కోట్ల ఆస్తి కలిగిన ధర్మేష్.. వెబ్సైట్ డొమైన్ నేమ్‌ల కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడరు. అయితే ఎంత ఖర్చు పెడతారో తిరిగి అంతకంటే ఎక్కువే సంపాదిస్తుంటారు. తాజాగా మరోసారి దాన్ని ప్రూవ్ చేశారాయన. ఇటీవల ఒక డొమైన్ నేమ్ కోసం ఏకంగా రూ.82 కోట్లు ఖర్చు చేశారు ధర్మేష్. అయితే కొన్న ధర కంటే ఎక్కువ లాభానికి ఈ డొమైన్ నేమ్‌ను ఇతరులకు అమ్మేశారాయన. తద్వారా వచ్చిన లాభాల్లో నుంచి రూ.2 కోట్లను ఖాన్ అకాడమీకి విరాళంగా ఇచ్చారు ధర్మేష్. ఇంతకీ ఆయన కొన్న ఆ ఖరీదైన డొమైన్ నేమ్ ఏంటంటే.. ‘చాట్.కామ్’. మరి.. ఒక డొమైన్ నేమ్ కోసం ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
2 months ago, I bought the domain https://t.co/UMWKLa0S0W for $10M+.
Here’s what happened next:https://t.co/kl70eH5bPy
tl;dr: Sold it for a profit and am donating $250k+ to @khanacademy .
— dharmesh (@dharmesh) May 25, 2023