క్రెడిట్ కార్డు.. ప్రస్తుతం వీటి వాడకం బాగా పెరిగింది. గతంలో అయితే దీనిని స్టేటస్ సింబల్‌గా భావించిన రోజులు కూడా ఉన్నాయ. అయితే ఇప్పుడు మాత్రం బ్యాంకులు అందరికీ కార్డులు మంజూరు చేస్తున్నాయి. వినియోగదారులు కూడా గతంతో పోలిస్తే క్రెడిట్ కార్డు వాడకాన్ని బాగానే పెంచేశారు. అవసరాన్ని బట్టి వివిధ రకాల క్రెడిట్ కార్డులను కూడా బ్యాంకులు అందిస్తున్నాయి. ఫ్యూయల్ ఎక్కువగా వాడేవారికి అందుకు సంబంధించిన కార్డులు, ప్రయాణాలు చేసేవారికి ట్రావెల్ క్రెడిట్ కార్డులు, షాపింగ్ చేసేవారికి లాభాలు చేకూరేలా కొన్ని కార్డులను జారీ చేస్తున్నాయి. అయితే చాలా మంది అవగాహన లేకుండానే క్రెడిట్ కార్డు ఇస్తాం అనగానే తీసేసుకుంటున్నారు.
క్రెడిట్ కార్డ్‌ని ఎలా వాడాలి అని చాలా మందికి పూర్తిగా తెలియదు. ఇప్పుడు వాడుకుంటే 40 రోజుల తర్వాత బిల్లు కట్టాలి అని మాత్రమే అనుకుంటూ ఉంటారు. అయితే కార్డు ఇచ్చే ఏజెంట్లు కూడా మీరు వడ్డీ లేకుండా 40 రోజులు డబ్బు వాడుకోవచ్చు.. డ్యూ డేట్ లోపు బిల్ కట్టేస్తే సరిపోతుంది అంటారు. అయితే క్రెడిట్ కార్డు వాడకంపై కొన్నిసార్లు ఇంట్రస్టు పడుతుంది. మీరు చేసే చెల్లింపులు, షాపింగ్‌లకు సంబంధించి జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డు వినియోగం వల్ల మీకు తెలియకుండానే కొన్నిచోట్ల అధికంగా నష్టపోతూ ఉంటారు. మీరు కట్టాల్సిన మొత్తం కంటే అదనంగా నష్టపోతూ ఉంటారు. అయితే అసలు మీరు ఎలాంటి చోట్ల క్రెడిట్ కార్డుని వాడకుండా ఉంటే మంచిదో తెలుసుకోండి.