రిలయన్స్ జియోకి ఎంత ఆదరణ ఉందో.. జియో ఫైబర్‌కి కూడా అదే ఆదరణ తీసుకురావాలని కంపెనీ పలు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ సందర్భంగా జియో ఫైబర్ నుంచి వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు వచ్చాయి. అదేంటంటే.. కొత్తగా జియో ఫైబర్ కనెక్షన్ తీసుకునే వారికి రిలయన్స్ జియో డబుల్ బొనాంజా ఫెస్టివ్ ఆఫర్లను ప్రకటించింది. మీరు జియో ఫైబర్ కొత్త కనెక్షన్ తీసుకుంటే మీకు రూ.6,500 వరకు అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్ అక్టోబర్ 18 నుంచి 28 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. అయితే అసలు ఆఫర్ ఏంటి? జియో ఫైబర్ ఎందుకు తీసుకోవాలి? ఆ ప్రయోజనాలు ఏంటనే విషయాన్ని చూద్దాం…
జియో ఫైబర్ ఇప్పటికే అన్ని సిటీల్లో తమ సేవలను ప్రారంభించాయి. హైదరాబాద్‌లాంటి మహా నగరాల్లో తమ సేవలను విస్తృతం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆఫర్లతో మరితం చేరువయ్యేందుకు ప్రణాళికలు చేస్తోంది. రూ.599, రూ.899 ప్లాన్లలో ఏదైనా ఒకటి ఆరు నెలలపాటు తీసుకుంటే.. డబుల్ ఫెస్టివ్ బొనాంజా ఆఫర్ ప్రకటించింది. అంతేకాకుండా రూ.899 ప్లాన్ ను 3 నెలలపాటు తీసుకున్నా సరే.. ఈ డబుల్ ఫెస్టివ్ బొనాంజా అందిస్తుంది. దీనిద్వారా మీకు 100 శాతం వాల్యూ క్యాష్ బ్యాక్ లభించేలా ఓచర్లను అందిస్తున్నారు. అంతేకాకుండా 6 నెలల ప్లాన్ తీసుకుంటే మీకు 15 రోజుల అదనపు వాలిడిటీ కూడా లభిస్తుంది.
జియో ఫైబర్ అందిస్తున్న ఈ రూ.599 ప్లాన్ ద్వారా 30 ఎంబీపీఎస్ స్పీడ్ లో నెట్ వస్తుంది. అలాగే 14 ఓటీటీల సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ఈ రూ.599 ప్లాన్ ని ఆరు నెలలపాటు.. అంటే జీఎస్టీతో కలిపి మీరు రూ.4,241 చెల్లించాలనమాట. అలా తీసుకుంటే మీకు రూ.4,500 విలువైన ఓచర్లు లభిస్తాయి. రూ.వెయ్యి విలువైన అజియో ఓచర్, రూ.వెయ్యి విలువై రిలయన్స్ డిజిటల్, రూ.వెయ్యి విలువైన నెట్ మెడ్స్ ఓచర్, రూ.వెయ్యి విలువైన ఇక్సిగో ఓచర్లను అందించనున్నారు.
ఈ ప్లాన్ తో వినియోగదారులకు 100 ఎంబీపీఎస్ స్పీడ్ తో ఇంటర్నెట్ వస్తుంది. 14 ఓటీటీల సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అలాగే ఈ ప్లాన్ ని 6 నెలలు అంటే.. జీఎస్టీతో కలిపి రూ.6,365 చెల్లించాల్సి ఉంటుంది. అలా తీసుకుంటే రూ.6,500 విలువైన ఓచర్లను అందిచనున్నారు. వీటిలో రూ.2 వేలు విలువైన అజియో, రూ.వెయ్యి విలువైన రిలయన్స డిజిటల్, రూ.500 విలువైన నెట మెడ్స్, రూ.3 వేలు విలువైన ఇక్సిగో ఓచర్ ను అందిస్తున్నారు. అలాగే 15 రోజుల అదనపు వ్యాలిడిటీ వస్తుంది. అలాగే ఈ ప్లాన్ 3 నెలలు తీసుకుంటే.. రూ.3,500 విలువైన ఓచర్లను అందిచనున్నారు. అయితే ఈ ఆఫర్లు, డబుల్ బొనాంజా ప్లాన్లు జియో ఫైబర్ బిజినెస్‌కు ఏమాత్రం సహకరిస్తాయో చూడాల్సి ఉంది.