ఐటీ సంస్థల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ఆర్థిక మాంద్యం కారణంగా కార్పొరేట్ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తీసేసొస్తున్నాయి. అమెజాన్, గూగుల్, మెటా, ట్విట్టర్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ లాంటి బడా టెక్ కంపెనీలు ఇప్పటివకే చాలా మంది ఎంప్లాయీస్‌ను ఇంటికి పంపించేశాయి. ఈ లిస్టులోకి తాజాగా మరో టెక్ దిగ్గజం డెల్ వచ్చి చేరింది. డెల్ సంస్థలో నుంచి వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. ఏకంగా 6,600 మంది ఎంప్లాయీస్‌ను తీసేసేందుకు కంపెనీ చర్యలు చేపట్టినట్లు డెల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ క్లర్క్ చెప్పారు. ఆర్థిక మాంద్యం, భవిష్యత్తుపై ఆందోళన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో ఈ తగ్గింపులు దాదాపుగా 5 శాతం వరకు ఉన్నట్లు జెఫ్ క్లర్క్ వెల్లడించారు. పర్సనల్ ల్యాప్‌టాప్ కొనుగోళ్లలో క్షీణత, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా, గతేడాది నవంబర్‌లో హెచ్‌పీ కంపెనీ కూడా సుమారుగా 6 వేల మందిని వచ్చే మూడేళ్లలో తొలగించనున్నట్లు చెప్పింది. పర్సనల్ కంప్యూటర్లకు డిమాండ్ తగ్గుతుండటంతో తమ లాభాలు తగ్గుతున్నాయని పేర్కొంది. అంతేకాదు సిస్కో సిస్టమ్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ కార్పొరేషన్ లాంటి టెక్ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగించాయి. మొత్తంగా 2022లో టెక్ సంస్థలు ఏకంగా 97,171 మంది ఎంప్లాయీస్‌ను పీకేశాయని సమాచారం. మరి.. వేలాది మంది ఉద్యోగులను టెక్ కంపెనీలు ఇంటికి సాగనంపుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
BREAKING: Dell set to cut over six thousand jobs
— The Spectator Index (@spectatorindex) February 6, 2023