బడ్జెట్ బడ్జెట్ బడ్జెట్.. బడ్జెట్ అనేది సామాన్యుల నుంచి పెద్ద తలకాయల వరకూ ప్రతి ఒక్కరికీ ముఖ్యమైనదే. ఎవరికి వారు వేసుకునే బడ్జెట్ కంటే.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టే బడ్జెట్టే కీలకం. ఎందుకంటే ఈ బడ్జెట్టే మొత్తం అందరి బడ్జెట్ లను ప్రభావితం చేస్తుంది. సామాన్యుల జీవితాలు భారం అయ్యేది? లేనిది? ఈ బడ్జెట్ మీదనే ఆధారపడి ఉంటుంది. వ్యాపారవేత్తల వ్యాపారాల పరిస్థితిని నిర్ణయించేదీ ఈ బడ్జెట్టే. బాగా ఉపయోగపడే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గితే సామాన్యుల కష్టాలు తీర్చినట్టే అవుతుంది. అలానే ఆయా కంపెనీలు దిగుమతి చేసుకునే వస్తువుల మీద కస్టమ్స్ సుంకాలు తగ్గిస్తే ప్రయోజనాలు చేకూరతాయి. కస్టమ్స్ సుంకం తగ్గించడం వల్ల సామాన్యులకు భారీగా ప్రయోజనం చేకూరుతుంది. తాజా బడ్జెట్ చూస్తుంటే సామాన్యులకు ఊరటనిచ్చే విధంగానే ఉన్నట్టు స్పష్టమవుతుంది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. తమ దైనందిన జీవితాల మీద బడ్జెట్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అని ప్రతి ఏడాది ప్రజలు బడ్జెట్ పై దృష్టి సారిస్తారు. రోజువారీ ఖర్చులను బడ్జెట్ ఎలా ప్రభావితం చేస్తుందో అని సామాన్యులు ఎదురు చూస్తుంటారు. ఈ బడ్జెట్ వల్ల జేబుకు భారం పెరుగుతుందా? లేక తగ్గుతుందా? అనేది తెలుసుకోవాలనుకుంటారు. అలాంటి సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. దీంతో అవసరమైన వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయి. టీవీలు, మొబైల్ ఫోన్లు వంటి ప్రధాన ఎలక్ట్రానిక్ వస్తువుల మీద కస్టమ్ డ్యూటీని ప్రభుత్వం తగ్గించింది. దీని వల్ల టీవీ, ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి.
దిగుమతులు చేసుకునే ఎలక్ట్రానిక్ భాగాల మీద కస్టమ్ డ్యూటీ తగ్గించడంతో ఎలక్ట్రానిక్స్ మర్కెట్ లో ఆయా వస్తువుల ధరలు తగ్గుతాయి. టీవీ ప్యానెళ్ల యొక్క ఓపెన్ సేల్స్ భాగాల మీద బేసిక్ కస్టమ్ డ్యూటీని 2.5 శాతానికి తగ్గించింది. కెమెరా లెన్సులు వంటి మీద కూడా దిగుమతి కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ఈ కారణంగా టీవీలు, మొబైల్ ఫోన్లు, కెమెరా లెన్సులు వంటివి చౌక ధరకు లభ్యం కానున్నాయి. గత రెండేళ్లలో మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, ఇయర్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు స్వల్పంగా తగ్గిన విషయం తెలిసిందే. అయితే ఈసారి బడ్జెట్ లో కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడం ద్వారా టీవీలు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయి.
To promote value addition in the manufacturing of TVs, I propose to reduce the Basic Customs Duty on parts of open cells of TV panels to 2.5%: FM Nirmala Sitharaman pic.twitter.com/XP0uAZVfOS
— ANI (@ANI) February 1, 2023