భూమి మీద మానవుడి మనుగడ మొదలైన నాటి నుంచి నేటి వరకు సమాజంలో ఎన్నో మార్పు జరిగాయి. మానవుడు తన మేధస్సును ఉపయోగించి ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలకు తెరతీస్తున్నాడు. రాయితో నిప్పు పుట్టించిన నాటి నుంచి నీటితో వెలుగును తెచ్చే వరకు మానవ విజ్ఞానంలో అనేక కొత్త ఆవిష్కరణలు వచ్చాయి. అలా ప్రస్తుతం టెక్నాలజీ యుగం నడుస్తోంది. అయితే ఈ సాంకేతికతకు విద్యుత్ అత్యవసరం. ఏం పనిచేయాలని ఇది ఉండాల్సిందే. అయితే కరెండ్ వాడకం కూడా తగ్గించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
సౌర, పవన, జలలా ద్వార మనకు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అయితే ఇది బాగా ఖర్చుతో కూడుకున్నదే కావడం మరోక వైపు బొగ్గు ద్వారా వాతారవరణం కాలుష్యం జరుగుతుంది. దీంతో విద్యుత్ అవసరమే లేకుండా పనులు జరిగితే బాగుటుంది కదా? అనే ఓ ఆలోచన పలు దేశాల్లోని శాస్త్రవేత్తల్లోకొత్త ప్రయోగాలకు పురిగొల్పింది. అలా వారి ఆలోచనల నుంచి పుట్టిన సరికొత్త ఆవిష్కరణలు ఉన్నాయి. అవి విద్యుత్ అవసరం లేకుండా పనిచేస్తాయి. మరి ఆ సరికొత్త ఆవిష్కరణల్లో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.. కొన్ని సందర్భాల్లో మంచంపై వేసే దుప్పటి వలన ఉక్కపోత వస్తుంది. అయితే వెంటనే ఏసీ వేసుకోవాలనిపించిన కరెంట్ లేకుంటే ఇక నరకమే. అందుకే ఏసీ వేయకుండానే మనకు ఏసీలా చల్లదనం ఇచ్చే బెడ్ షీట్లు ఇప్పుడు మార్కెట్లోకి వచ్చాయి.
ఇది జెల్ టెక్నాలజీ ద్వారా పని చేస్తుంది. ఈ కూల్ బెడ్ షీట్లను ఆన్ లైన్, ఆఫ్ లైన్ లలో కొనుగోలు చేయవచ్చు. వీటి ధర దాదాపు రూ.1,500. కొన్ని ఆన్‌లైన్ ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌లో రూ.699 కే లభిస్తోంది. మరొక కొత్త ఆవిష్కరణ ఏమిటంటే.. కరెంట్ లేకుండా ఏసీలా పనిచేసే మిషన్. కరెంట్ బిల్లులకు భయపడి చాలా మంది ఏసీ ఉన్న ఆఫ్ చేస్తుంటారు. అలాంటి సామాన్యుల కోసం గువహటి ఐఐటీ శాస్త్రవేత్తలు రేడియేటివ్ కూలర్ పూతను అభివృద్ధి చేశారు. దీనిని ఇంటి పైకప్పులకు వేస్తే ఇంటి మొత్తానికీ చల్లదనం అందిస్తుందని గువహటి శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రేడియేటివ్ కూలర్ పూత కారణంగా ఇంట్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయట.
ఇక మరో ఆవిష్కరణ ఇజ్రాయెల్ కు చెందిన కెన్షో కంపెనీ కనిపెట్టింది. బహిరంగ ప్రదేశాలను చల్లార్చేందుకు టవర్ కూలర్లు ఉపయోగిస్తారు. అయితే వీటి వాడకానికి చాలా విద్యుత్ అవసరం అవుతోంది. ఆరుబయట విద్యుత్ అవసరం లేకుండా పనిచేసే ఏసీని ఇజ్రాయెల్ కంపెని తయారు చేసింది. ద్రావణ నైట్రోజన్ ఆధారంగా పనిచేసే ఏసీని ఈ కంపెనీ అభివృద్ధి చేసింది. ఏసీలోని ప్రామాణిక ట్యాంకుల్లో లిక్విడ్ నెట్రోజన్ –196′ వద్ద ఫ్రీజ్ అయ్యి ఉంటుంది. ఇది గ్యాస్‌గా మారే క్రమంలో బలమైన ఒత్తిడిని కలగచేస్తుంది. ఆ ఒత్తిడితో ఈ ఏసీ పనిచేస్తుంది. దీంతో ఆ పరిసర ప్రాంతం పూర్తిగా చల్లబడుతుంది. మరి.. ఈ సరికొత్త ఆవిష్కరణలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.