ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న వాట్సాప్, ఈసారి వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. వినియోగదారుల క్రెడిట్ విశ్వనీయతకు కొలమానంగా భావించే ‘సిబిల్ స్కోర్’ తెలుసుకునేందుకు సులువైన మార్గాన్ని యూజర్లకు కల్పిస్తోంది. ఇందుకోసం ఎటువంటి చార్జెస్ కూడా వసూలు చేయడం లేదు. అంతా ఉచితం. ఒక మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఇలాంటి క్రెడిట్ బ్యూరో సేవలను అందించడం ఇదే మొదటిసారి.
బ్యాంకుకు వెళ్లి సార్.. నాకు లోన్ కావాలి అని అడగ్గానే బ్యాంకు సిబ్బంది నోటి నుంచి మొదటి మాట ఇదే. చెప్దామా? అంటే అదేంటో మనకు తెలియదు. మొదటిసారి ఈ పదం విన్నవారికే ఈ సమస్య. సిబిల్ స్కోర్ అనేది మీ క్రెడిట్ నివేదికను సూచించే మూడు అంకెల సంఖ్య. 300 నుండి 900 మధ్యలో ఉంటుంది. మీరు సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువుగా ఉంటే అంత మంచిది. అంటే.. మీ సిబిల్ స్కోర్ 900కి దగ్గరగా ఉంటే.. రుణం పొందే అవకాశాలు చాలా ఎక్కువ. అదే.. 300కి దగ్గరగా ఉంటే రుణం పొందే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి ప్రతి ఒక్కరు సిబిల్ స్కోర్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం ద్వారా దానిపై నిఘా ఉంచడం అవసరం.
New WhatsApp update: Check credit score for free https://t.co/7h8bcEgQJ6
— Telecomtariff (@telecomtariff) November 13, 2022