అమ్మిన వస్తువులో లోపాలు, మోసపూరితమైన వాణిజ్య పద్ధతులను అనుసరిస్తూ..నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కంపెనీలపై గతంలో అనేక పిటిషన్లు వినియోగ దారుల చట్టం కింద దాఖలయ్యాయి. పెద్ద కంపెనీలేమీ అతీతం కాదూ. తాాజాగా ఓ కార్ల కంపెనీ ఆ జాబితాలోకి చేరింది.
వస్తువుల తయారీలో నాణ్యత లేకపోయినా, ఆ వస్తువు గురించి తప్పుడు సమాచారం అందించినా లేదా అమ్మకంలో అవకతవకలకు పాల్పడినా, అసంతృప్తికరమైన సేవలు అందించినా వినియోగదారుల హక్కుల చట్టాన్ని ఆశ్రయించవచ్చు వినియోగదారుడు. కొనుకున్న వస్తువులో లోపాలు, మోసపూరితమైన వాణిజ్య పద్ధతులను అనుసరిస్తూ..నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కంపెనీలపై గతంలో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. పలు కంపెనీలు వినియోగదారుని న్యాయ స్థానం (కన్జ్యూమర్ కోర్టు) జరిమానాలతో పాటు చీవాట్లు పెట్టిన సంగతి విదితమే. పెద్ద కంపెనీలేమీ అతీతం కాదూ. తాజా ఆ జాబితాలోకి చేరింది ప్రముఖ కార్ల కంపెనీ పోర్షే.
తనకు విక్రయించిన కారును తయారు చేసిన సంవత్సరాన్ని తప్పుగా చూపించారంటూ పోర్షే సంస్థకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాడో వ్యక్తి. దీంతో ఆ సంస్థకు కన్జ్యూమర్ కోర్టు భారీ జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ లోని మీరట్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ మిట్టల్ అనే వినియోగదారుడు.. గురుగ్రామ్‌లోని పోర్షే నుండి కారును కొనుగోలు చేశాడు. 2013లో తయారు చేసిన పోర్షే కారు 2014లో తయారు చేసిన కారుగా విక్రయించారని, మోసం చేశారంటూ వినియోగదారుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతే కాకుండా సర్వీసులో లోపం ఉన్నట్లు పేర్కొన్నాడు.
తయారు చేసిన సంవత్సరం గురించి అబద్ధం చెబుతూ రూ. 80 లక్షలకు కేయాన్‌ను విక్రయించినట్లు కస్టమర్ ఆరోపించారు. అయితే అదే తరహాలో కొత్త కారు ఇవ్వాలని, తాను ఖర్చు చేసిన ఇతర ఖర్చులతో పాటు పూర్తి కారు ధరలను తిరిగి చెల్లించాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు. జస్టిస్ రామ్ సూరత్ రామ్ మౌర్య, డాక్టర్ ఇందర్ జిత్ సింగ్‌లతో కూడిన జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC)డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. సంస్థ సేవలో లోపాలున్నాయని, అన్యాయమైన వాణిజ్య పద్ధతిని అనుసరించిందని గుర్తించింది కోర్టు. అతనికి రూ.18 లక్షలకు పైగా పరిహారం చెల్లించాలని ఆదేశించింది.