‘సంపాదించాలన్నా కోరిక, తెలివి తేటలు ఉండాలి కానీ, కోట్లు సంపాదించొచ్చు..’ ఈ డైలాగ్ రోజూ వినేదే. కాకుంటే.. మనం ఆచరణలో పెట్టం. కానీ, ఓ యువతి అలా కాదు.. తనకు నచ్చిన పనినే తనకు లాభదాయకంగా మార్చుకుంది. రోజూ బీచ్ వెంట తిరుగుతూ లక్షలు సంపాదిస్తోంది. ఇందుకు ఆ యువతి తన శ్రమనంతా దారపోస్తుంది అనుకుంటే పొరపాటు.. తన తెలివితేటలు ఉపయోగిస్తోంది అంతే. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టిందంటే చాలు.. కాసులు కురవాల్సిందే. అందుకు ఆమె.. చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ తన అలవాటునే వృత్తిగా స్వీకరించింది. అలా ఏడాదికి 12 లక్షల రూపాయలు సంపాదిస్తోంది.
సౌత్ చైనాకు చెందిన ఫెంగ్ అనే యువతి సేల్స్ ఉద్యోగం చేసేది. అది తనకు సంతృప్తిని ఇవ్వకపోయినా కుటుంబ అవసరాల కోసం చేయాల్సి వచ్చేది. ఫెంగ్ అలా ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాల్లో, సెలవు దినాల్లో దగ్గరలో ఉన్న బీచ్ కు వెళ్ళేది. వెళ్ళాక అందరిలా అక్కడున్న వారిని చూస్తూ కూర్చోదు. ఇసుకలో ఎంతో సృజనాత్మకంగా, కొత్తదనం జోడించి బొమ్మలు వేసేది.. వాటి మధ్య మనసుకు నచ్చిన మెసేజ్ లు రాసేది. పుట్టినరోజు, పెళ్ళిరోజు.. అలా సందర్భం ఏదైనా సరే.. తన క్రియేటివ్ తెలివితేటలతో ఎంతో ఆకర్షణీయంగా నిర్మించేది. బీచ్ లో ఆమె చేసే పని అదే. ఒకరోజు అనుకోకుండా ఫెంగ్, తను రాసిన వాటిని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంతే.. తన జీవితమే మారిపోయింది.
వీటిని చూసిన నెటిజన్లు ‘ఇదేదో కొత్తగా ఉందే.. మనకు నచ్చిన వారిని ఈ పద్దతిలో విష్ చేస్తే చాలా బాగుంటుంది’ అనుకున్నారు. అయితే.. అందరికీ బీచ్ అందుబాటులో ఉండదుగా.. ఉన్నా ఫెంగ్ లాగా క్రియేటివిటీ ఉండదు. అందుకే ‘మాకు ఇలా మెసేజెస్ రాసి పెట్టండి’ అంటూ ఫెంక్ కు ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అలా అని ఊరికే కాదు.. డబ్బులిచ్చేవారు. చిన్నగా మొదలైన ఈ ఆర్డర్లు సంఖ్య.. పదులకు చేరింది. దీంతో ఫెంగ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. పూర్తిగా మెసేజ్ లు రాసే వృత్తిని ఎంచుకుంది. దీనికి కుటుంబ సభ్యుల మద్దతు కూడా తోడైంది. ఫెంగ్ ప్రతిరోజూ బీచ్ కు వెళ్లడం, ఆర్డర్లపై మెసేజ్ లు రాసివ్వడం. దీని వల్ల ఫెంగ్ కు నెలకు దాదాపు లక్షన్నర రూపాయల ఆదాయం వస్తోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా నెటిజన్లు ఆమె తేలితేటలను మెచ్చుకుంటూ ప్రశంసిస్తున్నారు. మీరు కూడా ఇలా మీ క్రియేటివ్ మైండ్ తో లక్షలు గడించండి. వీలైతే.. మీ ఆలోచనలను మాతో కూడా పంచుకోండి..
‘Romantic, isn’t it?’: woman quits job to draw sand messages of love on beaches https://t.co/FOSzxEZzhQ
— South China Morning Post (@SCMPNews) January 3, 2023