ఇలా చేస్తే బంగారం మీద రూ. 20 వేల వరకూ.. వెండి మీద రూ. 6 వేలు లాభం పొందే అవకాశం ఉంటుంది. రెండిటి మీద రూ. 26 వేలు లాభం పొందే అవకాశం ఉంది. అదెలాగో మీరే చూడండి.
కొంతమంది బంగారం, వెండి కొనుగోలు చేయడాన్ని పెట్టుబడి మార్గంగా చూస్తారు. మెజారిటీ ప్రజలు అందం కోసం, ఇతర ప్రయోజనాలకు ఉపయోగపడతాయని భావిస్తారు. అయితే ఎవరెలా చూసినా గానీ ప్రస్తుతం ఉన్న సమయంలో కొనుగోలు చేయడం అనేది ఉత్తమమైన మార్గం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బంగారం, వెండి ధరలు కనిష్ట ధరకు పడిపోయాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో పతనమవుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్ళీ పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో దేశీయంగా తగ్గుతున్న పసిడి, వెండి ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు కనుక బంగారం, వెండి మీద ఇన్వెస్ట్ చేస్తే కనుక రూ. 26 వేలు మిగుల్లో ఉండే అవకాశం ఉంది. అదెలాగో మీరే చూడండి.
ఇవాళ అనగా మే 20న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 60,870కి చేరుకుంది. ఇంకా తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ తగ్గినా రూ. 200, రూ. 300 తగ్గే అవకాశం ఉంటుంది కానీ రూ. 60 వేల కంటే తక్కువ తగ్గే అవకాశం ఉండదు. ఇదే నెలలో 5వ తేదీన 24 క్యారెట్ల బంగారం రూ. 62,400 పలికింది. 15 రోజుల్లో రూ. 1530 తగ్గింది. మే 1న కనిష్టంగా రూ. 60,760 పలికింది. ఒకవేళ బంగారం రూ. 60,400కి చేరుకున్న సమయంలో కొనుగోలు చేస్తే కనుక మీకు రూ. 2 వేలు లాభం వస్తుంది. ఎందుకంటే ఎక్కడ అయితే ధర రికార్డు స్థాయికి చేరుకొని.. ఆ తర్వాత వరుసగా పడిపోతూ వచ్చిందో మళ్ళీ అదే రికార్డు ధరకి, అంతకంటే ఎక్కువ ధరకు చేరుకోవడానికి మార్కెట్ ప్రయత్నం చేస్తుంది.
ఈ 15 రోజుల్లో రూ. 1530 తగ్గింది కాబట్టి ఇవాళ బంగారం కొనుగోలు చేస్తే ఎంతైతే తగ్గిందో అదే మీకు లాభం అన్నట్టు. ఎందుకంటే బంగారం మళ్ళీ దాని గరిష్ట ధరను ఖచ్చితంగా తాకుతుంది. ఇవాళ రూ. 60,870 ఉన్న బంగారం కొద్ది రోజుల్లోనే మళ్ళీ 62 వేల మార్కుని దాటే అవకాశం ఉంటుంది. 63 వేల మార్కుని కూడా టచ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ లెక్కన చూసినా గానీ ఇప్పుడు రూ. 60,870 పెట్టి 10 గ్రాముల బంగారం కొనుగోలు చేస్తే కొద్ది రోజుల తర్వాత రూ. 62 వేలు, రూ. 63 వేలకు చేరుకుంటుంది. అప్పుడు మీరు రూ. 1130 నుంచి రూ. 2,130 వరకూ లాభం పొందే అవకాశం ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం కొన్నా ఇలానే లాభం అనేది ఉంటుంది.
ఇవాళ అంటే మే 20న 10 గ్రాముల బంగారం రూ. 55,790గా ఉంది. ఈ నెలలో 22 క్యారెట్ల బంగారం గరిష్ట ధర రూ. 57,200గా ఉంది. కనిష్ట ధర వచ్చేసి రూ. 55,700గా ఉంది. ఈ నెలలో హెచ్చుతగ్గులు అనేవి చూశాము. ఇప్పుడున్న ధరకు అంటే రూ. 55,700తో బంగారం కొనుగోలు చేస్తే కొద్ది రోజుల్లోనే రూ. 1500 లాభం అనేది ఉంటుంది. రూ. 55,700 ఉన్న 22 క్యారెట్ల బంగారం రూ. 57,200 కంటే ఎక్కువగా అంటే 58 వేలకు చేరుకుంటే కనుక రూ. 2 వేలు లాభం అనేది ఉంటుంది. ఒక పది, ఇరవై రోజులు ఆలస్యం అయినా కానీ తగ్గిన బంగారం ధరలు అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. 5 తులాల బంగారం కొంటే కనుక తులానికి రూ. 2 వేల చొప్పున రూ. 10 వేలు లాభం పొందే అవకాశం ఉంటుంది. అదే 10 తులాల మీద అయితే రూ. 20 వేలు లాభం పొందే ఛాన్స్ ఉంటుంది.
మే 5న కిలో వెండి గరిష్ట ధర రూ. 83,700గా ఉంది. ఈ ఏడాదిలో చూసుకుంటే రికార్డు ధర ఇది. ప్రస్తుతం ఈ వెండి ధర రూ. 78 వేల వద్ద కొనసాగుతోంది. ఇప్పుడు కనుక వెండి కొనుగోలు చేస్తే కనుక కనీసం రూ. 5,700 లాభం పొందే అవకాశం ఉంది. ఎక్కడైతే వెండి ధర రికార్డు స్థాయికి చేరుకొని పతనం మొదలయ్యిందో మళ్ళీ వెండి ఆ రికార్డు ధరకు చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో రూ. 78 వేలకు పతనమైన వెండి మళ్ళీ రూ. 83,700 కి చేరుకుంటుంది. రూ. 84 వేలు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు మీరు రూ. 6 వేలు లాభం పొందుతారు. తగ్గినప్పుడే కొనుగోలు చేస్తే మీకు ఈ లాభం అనేది ఉంటుంది.
గమనిక: ఈ లాభాలు అనేవి వెంటనే రాకపోవచ్చు. కొంత సమయం పట్టచ్చు. కాబట్టి నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని, సమీక్ష చేసుకుని ముందుకెళ్తే మంచిది. మీరు తీసుకునే నిర్ణయానికి పూర్తి బాధ్యత మీదే. సుమన్ టీవీ యాజమాన్యానికి ఎటువంటి సంబంధమూ లేదు.