దేశంలో నిత్యావసర ధరలు ఆకాశన్నంటుతున్నాయి. సామాన్యులపై ధరల భారం విపరీతంగా పెరిగిపోతుంది. ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు అన్నట్లుగా మారింది పరిస్థితి. మరీ ముఖ్యంగా వంట నూనె, పప్పులు, ఇంధన ధరలు, కూరగాయలు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పండగ అన్న సంతోషం కూడా లేకుండా చేశాయి. ఈ క్రమంలో పండుగ పూట కేంద్రం సామాన్యులకు భారీ శుభవార్త చెప్పింది. ఏకంగా 11 నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తూ.. గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.
సెప్టెంబర్ నెలలోనే కేంద్రం 11 రకాలైన నిత్యావసర వస్తువుల దరలను తగ్గించిందని పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. 2022, సెప్టెంబర్ 2న లీటరు 132 రూపాయలుగా ఉన్న పామాయిల్ సగటు ధరను అక్టోబర్ 2వరకు గరిష్టంగా 11 శాతం తగ్గి.. 118 రూపాయలకు చేరిందని వెల్లడించారు. ఇక వనస్పతి నెయ్యి కిలో 152 నుంచి 6 శాతం తగ్గి.. 143 రూపాయలకు చేరిందన్నారు. అలానే సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర లీటర్‌కు 176 రూపాయలు ఉండగా.. 6 శాతం తగ్గించడంతో.. ప్రస్తుత 165 రూపాయలకు చేరిందని.. సోయాబీన్ నూనె కూడా 156 నుంచి 148 రూపాయలకి తగ్గిందని తెలిపారు.
ఇక ఆవనూనె ధర లీటర్‌కు 173 రూపాయలు ఉండగా.. 3శాతం తగ్గి.. ప్రస్తుతం 167 రూపాయలకు చేరిందని తెలిపారు. అలానే లీటర్ 189 రూపాయలు ఉన్న వేరుశనగ నూనె ధర 2 శాతం తగ్గి.. 185 రూపాయలకు చేరినట్లు వెల్లడించారు. ఇక కూరగాయల విషయానికి వస్తే.. ఉల్లిపాయలు కిలో ధర 26 నుంచి 24 రూపాయలకు తగ్గిందని.. బంగాళదుంప కూడా 7 శాతం తగ్గి.. 28 నుంచి 26 రూపాయలకు తగ్గిందని తెలిపారు.
ఇక పప్పు దినుసుల ధరలు కూడా తగ్గాయని వెల్లడించారు. మసూల్ దాల్ కిలో 97 రూపాయలు ఉండగా.. 3 శాతం తగ్గి.. 94 రూపాయలుగా ఉందని.. అలానే మినప పప్పు కిలో 108 నుంచి 106 రూపాయలకు తగ్గిందని తెలిపారు. స్థూలంగా చూస్తే పప్పు దినుసుల ధర కిలో 74 రూపాయల నుంచి 71 రూపాయలకు తగ్గిందని తెలిపారు. ఇక గ్లోబర్ ధరల పతనంతో.. దేశీయంగా ఆహార, చమురు ధరలు తగ్గుముఖం పట్టాయని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రసుత్తం భారతదేశంలో.. వంట నూనెల రిటైల్ ధరలు గణనీయంగా పడిపోయాయని పేర్కొంది.
त्यौहारों के समय में खाद्य पदार्थों के दामों में गिरावट, घर में उत्सव, बजट में राहत। pic.twitter.com/oklqSiOn3U
— Piyush Goyal (@PiyushGoyal) October 3, 2022