కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్ లో 2023-24 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ లో అందరి దృష్టిని ఆకర్షింపజేసిన అంశం ఆదాయపన్ను శ్లాబుల్లో మార్పులు చేయడం. అయితే దాని తర్వాత అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం ఇంకొకటి ఉంది. అదేంటంటే.. వ్యాపారస్థులకు సంబంధించి కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలని చూస్తున్న వారికి ఇది శుభవార్త అనే చెప్పాలి. వ్యాపార అనుమతులు, కార్యకలాపాల కోసం ఉద్దేశించిన కొన్ని నిబంధనలు సడలిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
బడ్జెట్ లో వ్యాపారస్థులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. సాధారణంగా వ్యాపారం ప్రారంభించాలి అంటే అందుకోసం అనుమతులు, పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అందుకోసం సమయం మాత్రమే కాకుండా.. ఖర్చు కూడా అవుతుంది. ఇప్పటి నుంచి అలాంటి జంజాటం లేకుండా ఈ అనుమతులు ఉపయోగపడున్నాయి. వ్యాపార అనుమతులు, కార్యకలాపాల కోసం సంబంధించిన నిబంధనలు సడలిస్తూ కొత్త సంస్కరణము బడ్జెట్ లో తీసుకొచ్చారు. పర్మినెంట్ అకౌంట్ నంబర్(PAN)ను సింగిల్ బిజినెస్ ఐడీగా చట్టబద్ధం చేస్తున్నామంటూ ప్రకటించారు.
ఏదైనా సంస్థను గుర్తించాలంటే నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ గా పాన్ కార్డు ఒక్కటి సరిపోతుందంటూ నిబంధనలు తీసుకొచ్చారు. వ్యాపార అనుమతులు తీసుకోవడంతో పాటుగా.. వ్యాపార కార్యకలాపాలు కూడా నిర్వహించుకునేందుకు వీలుగా నిబంధనలు సడలించారు. వివిధ వ్యాపార కార్యకలాపాల కోసం ఈపీఎఫ్ వో, టీఐఎన్, జీఎస్ టీఎన్, టీఏఎన్, ఈఎస్ఐసీ వంటి పలు రకాల పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇది ఖర్చుతో కూడుకున్నదే కాకుండా సమయం కూడా ఎత్తువ పడుతుంది. ఇప్పుడు తెచ్చిన ఫైనాన్స్ యాక్ట్ 2023 కింద ఒక్క పాన్ కార్డు మాత్రమే సరిపోతుంది.
BREAKING: #BNNIndia Reports.
Now PAN Card will be used as a common identifier for all digital systems of govt departments. #india #breakingnews #nirmalasitharam #pan #pancard #fees #indianews #budget #budget2023 pic.twitter.com/grFKNoGpJy
— Gurbaksh Singh Chahal (@gchahal) February 1, 2023