డోలో 650.. ఈ పేరు తెలియని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. కరోనా కష్టకాలంలో ఎంతోమందికి ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి లక్షణాల నుంచి ఉపశమనం కలిగించింది ఈ ఔషదమే. తాజాగా ఈ డోలో 650 తయారీ సంస్థ మైక్లో ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీపై అవినీతి ఆరోపణలు పెళ్లుబుకాయి. వందల కోట్ల అవినీతి, పన్ను ఎగవేత ప్రయత్నాలు చేసినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) ఆరోపించింది.
అంతేకాకుండా సీబీడీటీ రిపోర్ట్ లో పలు సంచలన ఆరోపణలు, విషయాలు వెలుగు చూశాయి. బెంగళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్ సంస్థ 9 రాష్ట్రాల్లో దాని కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బుధవారం ఈ సంస్థకు చెందిన మొత్తం 36 ప్రాంతాల్లో సీబీడీటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సోదాలు పలు కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ డేటాను కలెక్ట్ చేశారు
సీబీడీటీ తయారు చేసిన రిపోర్టులో.. డోలో 650 ఔషధాన్ని ప్రమోట్ చేసేందుకు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆరోపించారు. వైద్యులు, పలు సంస్థలకు బహుమతుల రూపంలో దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు చేసినట్లు ప్రస్తావించారు. వాటిని సరైన అకౌంట్ లో చూపించలేదని ఆరోపించారు. అంతేకాకుండా కార్యాలయాల్లో లెక్కల్లో లేని రూ.1.2 కోట్ల నగదు, 1.4 కోట్ల విలువైన బంగారం, నగలు స్వాధీనం చేసుకున్నట్లు రిపోర్ట్ లో తెలిపారు. అయితే సీబీడీటీ రిపోర్ట్ లో మైక్రో ల్యాబ్స్ సంస్థ పేరు లేకపోయినా.. విశ్వనీయ వర్గాలు ఆ సంస్థ పనే అని ధ్రువీకరించాయి. డోలో 650 తయారీ సంస్థపై వచ్చిన ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The #IncomeTax Department on Wednesday said it has recently carried out search and seizure operations against a major #Bengaluru-based pharmaceutical group, Micro Labs whose medicine Dolo-650 was in high demand during the #COVID waves.@IncomeTaxIndia pic.twitter.com/bXDoUzKQ3x
— IANS (@ians_india) July 13, 2022